వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

36 ఏళ్ల తర్వాత పాక్ జైలు నుంచి విడుదలైన జైపూర్‌వాసి

By Srinivas
|
Google Oneindia TeluguNews

కరాచి/న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని లాహోర్ సెంట్రల్ జైలు నుంచి ఓ భారతీయుడు 36 ఏళ్ల తర్వాత విడుదలయ్యారు. ఈ మేరకు సోమవారం అతనిని విడుదల చేశారు. సత్ర్పవర్తన కలిగిన ముప్పై మంది భారతీయ ఖైదీలను పాకిస్తాన్ విడుదల చేసింది. అందులో జైపూర్‌కు చెందిన 70 ఏళ్ల గజానంద్ శర్మ ఉన్నారు.

అట్టారి - వాఘా సరిహద్దు గుండా అతను 36 ఏళ్ల క్రితం మన దేశంలోకి అడుగు పెట్టారు. 1982లో ఆయన కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఆయన తన సొంతూరుకు వచ్చారు. ఆయన తిరిగి రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అంతులేకుండా పోయింది.

Jaipur man back after languishing in Pakistan jail for 36 years

ఆయన భారత్ తిరిగి వచ్చిన సమయంలో కుర్తా, నల్లటి చెప్పులు, చేతిలో తెల్లటి ప్లాస్టిక్ సంచితో వచ్చారు. రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు నిర్వహించి, అతనిని దేశంలోకి అనుమతించారు. విప్రా ఫౌండేషన్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికారు.

గజానంద్ శర్మ రాకతో ఆయన సతీమణి భావోద్వేగానికి లోనయ్యారు భర్త తిరిగి వచ్చాడనే విషయం ఇన్నేళ్ల తర్వాత నమ్మలేకపోతున్నామన్నారు. ఇన్నాళ్లు కుటుంబ పెద్ద లేకుండా ఉన్నామన్నారు. ఆయన తిరిగి వచ్చేందుకు సహకరించిన వారికి థ్యాంక్స్ చెప్పారు.

English summary
Jaipur man back after languishing in Pakistan jail for 36 years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X