ఒకటి రెండురోజుల్లో జల్లికట్టు: పన్నీర్, మీ పని మీరు చూసుకోండి
ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, నిరసనకారులు వెంటనే తమ నిరసన ప్రదర్శనలు విరమించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మనవి చేశారు. అయితే నిరసన కారులు.
చెన్నై: ఒకటి రెండు రోజుల్లోనే జల్లికట్టు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని, నిరసనకారులు వెంటనే తమ నిరసన ప్రదర్శనలు విరమించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మనవి చేశారు.
జల్లికట్టు ఆందోళనకు విద్యార్థి సంఘాలు పూర్తి మద్దతు ఇచ్చి రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు నడిగర సంఘం మద్దతు ఇవ్వడం, డీఎంకే నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా రైలురోకోలు మొదలవ్వడం జరిగిపోయాయి.

బెంగళూరులో దుమ్ములేపిన తమిళ తంబీలు: జల్లికట్టు ఎఫెక్ట్
జల్లికట్టుకు మద్దతుగా ఏఆర్ రెహమాన్ ఒక రోజు నిరాహార దీక్ష ప్రారంభించడంతో రచ్చరచ్చ అయ్యింది. ఈనేపథ్యంలో శుక్రవారం ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు.
జల్లికట్టును అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన చట్టానికి సరవణలు తెచ్చే విషయంపై రాజ్యాంగ నిపుణులతో చర్చించామని పన్నీర్ సెల్వం చెప్పారు. సవరణ ముసాయిదాను తమిళనాడు ప్రభుత్వం ఈ రోజు ఉదయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించిందని అన్నారు.
దానికి ఒకటి రెండురోజుల్లోనే అనుమతి వస్తుందని, జల్లికట్టుకు మార్గం సుగమం అవుతుందని తాను భావిస్తున్నానని పన్నీర్ సెల్వం వివరించారు. కేంద్ర ప్రభుత్వంతో సవరణ ముసాయిదా విషయాన్ని చర్చించేందుకు వీలుగా రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులను ప్రత్యేక బృందంగా నియమించామని పన్నీర్ సెల్వం తెలిపారు.
జల్లికట్టు దెబ్బ: ప్రధాని మోడీతో పన్నీర్ సెల్వం: ఏం చెప్పారంటే !
అయితే సీఎం పన్నీర్ సెల్వం విన్నపాన్ని నిరసనకారులు పట్టించుకోవడం లేదు. మీ పని మీరు చేసుకోండి, మాపని మేము చేసుకుంటాం అని కచ్చితంగా తేల్చి చెప్పారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్, కరుణానిధి కుమార్తె, ఎంపీ కనిమొళి రంగంలోకి దిగారు.
డీఎంకే నేతృత్వంలో రైలురోకోలలో పాల్గోన్నారు. ఎగ్మూర్ రైల్వేస్టేషన్ లో కనిమొళి, మాంబగళం రైల్వేస్టేషన్ లో ఎంకే స్టాలిన్ రైలు పట్టాల మీదకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో రైల్వే పోలీసులు స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications