తగలబడిన చెన్నై, పోలీస్ స్టేషన్ కు నిప్పు, మాతో పెట్టుకుంటే ?

చెన్నై: జల్లికట్టు నిర్వహణకు శాశ్వత చట్టం తీసుకురావాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఒక్క సారిగా రెచ్చిపోయారు.

మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులను సోమవారం ఉదయం పోలీసులు బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నించారు. అయితే శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద తమిళనాడు ప్రభుత్వం తమ ప్రతాపం చూపించడానికి ప్రయత్నించింది.

అందుకోసం పోలీసులను అక్కడికి పంపించడంతో పరిస్థితి ఒక్క సారిగామారిపోయింది. పోలీసులు లాఠీచార్జ్ చెయ్యడంతో విద్యార్థులు సహనం కోల్పోయారు. పోలీసులు, విద్యార్థుల మధ్య మాటల యుద్దం జరిగింది.

Jallikattu protests turn violent, Ice house police station set on fire by miscreants.

ఆ సమయంలో పోలీసులు మళ్లీ లాఠీలకు పని చెప్పడంతో విద్యార్థులు రెచ్చిపోయారు. వేలాది మంది విద్యార్థులు ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ ముట్టడించి నిప్పంటించారు. సమీపంలో ఉన్న వాహనాలకు నిప్పటించడంతో జల్లికట్టు పోరాటం హింసాత్మకంగా మారిపోయింది.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను అదుపుచెయ్యడానికి ప్రయత్నించారు. అయితే వేలాది మంది విద్యార్థులను అదుపుచెయ్యడం పోలీసులకు సాధ్యంకాలేదు. అదనపు బలగాలను రంగంలోకి దింపారు. పరిస్థితి అదుపు చెయ్యడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+