నిప్పులాంటి దేశభక్తుడు..ఆయనలో గాడ్సే కనిపిస్తున్నాడు: జామియా షూటర్‌ను కీర్తించిన హిందూ మహాసభ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం. జాతీయ పౌర నమోదు కార్యక్రమాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలను నిర్వహించిన జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులపై కాల్పులు జరిపిన రామ్‌భక్త్ గోపాల్ శర్మపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోంది హిందూ మహాసభ. ఆయనను నాథూరామ్ గాడ్సేతో పోల్చింది. నిఖార్సయిన, నిప్పులాంటి దేశభక్తుడని కీర్తిస్తోంది.
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా గురువారం న్యూఢిల్లీలో మహార్యాలీని నిర్వహించడానికి ప్రయత్నించిన జామియా మిల్లియా విశ్వవిద్యాలయం విద్యార్థులపై గోపాల్ శర్మ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో జామియా విద్యార్థి ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం గోపాల్ శర్మను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు.
Recommended Video

ఈ ఘటన పట్ల హిందూ మహాసభ అధికార ప్రతినిధి గోపాల్ పాండే స్పందించారు. గోపాల్ శర్మ చేసిన పనికి తాను గర్విస్తున్నానని అన్నారు. విద్యార్థులు కోరుతున్నట్లుగా వారికి స్వాతంత్య్రాన్ని ప్రసాదించడానికి ప్రయత్నించాడని ప్రశంసించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోన్న వారిని ఎలా ఎదుర్కోవాలో చూపించాడని, ఒక బాటను పరిచాడని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తోన్న వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గోపాల్ శర్మలో ఓ నాథూరామ్ గాడ్సే కనిపిస్తున్నారని కితాబిచ్చారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications