రాజధాని ఎక్స్ ప్రెస్కు బాంబు బెదిరింపు: 4 గంటలు ఆలస్యం
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపుతో జమ్మూ నుంచి ఢిల్లీకి రావాల్సిన రాజధాని ఎక్స్ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. రాజధాని ఎక్స్ప్రెస్లో బాంబు ఉందని సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్ అధికారులు పంజాబ్ పోలీసులకు సమాచారం అందిచ్చారు.
దీంతో రాజధాని ఎక్స్ప్రెస్ను ఆర్మీ, పోలీసు అధికారులు పంజాబ్లోని పఠాన్ కోట్లో నిలిపివేశారు. అనంతరం రైలును నిలిపివేసి నాలుగు గంటలపాటు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. రాజధాని ఎక్స్ ప్రెస్లో ఎలాంటి బాంబు లభించలేదని తెలిపారు.

రైల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని తేలడంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ, పోలీసు అధికారుల తనిఖీల అనంతరం నాలుగు గంటలు ఆలస్యంగా రాజధాని ఎక్స్ప్రెస్ తిరిగి పయనమైంది. పఠాన్ కోట్ పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరగా ఉండటం, జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కాలంలో ఉగ్రదాడులు పెరగడంతో, భద్రతా సిబ్బంది నిఘా పెంచారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications