జమ్మూలో వరద బీభత్సం: 16 మంది మృతి, 20 మంది గల్లంతు ( పిక్చర్స్)

కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ ప్రజలు వరదల దెబ్బకు హడలిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. సర్వం పోగొట్టుకున్న బాధితులు చెట్ల కింద, ప్రభుత్వం ఎర్పాటు చేసిన శిభిరాలలో తలదాచుకుంటున్నారు. తినడానికి తిండిలేక అల్లాడుతున్నారు.

గత 30 గంటల నుండి భారీ వర్షాలు రావడంతో జీలం నది పొంగిపోర్లుతున్నది. జమ్మూలోని సంగం ప్రాంతంలో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. బద్గాం జిల్లాలో 36 ఇండ్లు నేలమట్టం అయ్యాయి. శిథిలాల కింద 16 మంది మరణించారు. 20 మంది గల్లంతు అయ్యారు.

జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన 10 టీంలు, సైనికులు సహాయక కార్యక్రమాలలో పాల్గొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దప్రాతిపాదికన రంగంలోకి దిగాయి. కేంద్ర మంత్రి నఖ్వీ జమ్మూ చేరుకుని అక్కడే మకాం వేసి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నారు.

జమ్మూ పరిస్థితి గమనించి వివరాలు సేకరించిన ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే రూ. 200 కోట్ల తక్షణ సహాయం అందించారు. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం రూ. 235 కోట్ల తక్షణ సహాయం విడుదల చేసింది.

కేంద్ర మంత్రి నఖ్వీని కాశ్మీర్ పంపించిన మోది

కేంద్ర మంత్రి నఖ్వీని కాశ్మీర్ పంపించిన మోది

కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని వెంటనే కాశ్మీర్ వెళ్లాలని నరేంద్ర మోది సూచించారు. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని మోది ఆదేశాలు జారీ చేశారు.

రంగంలోకి దిగిన వాయుసేన

రంగంలోకి దిగిన వాయుసేన

జాతీయ విపత్తు సహాయక దళం అందించే ఆహారం, నిత్యవసర వస్తువులను సేకరించిన భారత వాయుసేన అధికారులు వరద భాదితులకు అందిస్తున్నారు.

శ్రీనగర్ కార్పొరేషన్ సిబ్బంది సహాయం

శ్రీనగర్ కార్పొరేషన్ సిబ్బంది సహాయం

జాతీయ విపత్తు సహాయక దళం టీంలు చురుకుగా సహాయక కార్యక్రమాలలో పాల్గోంటున్నాయి. శ్రీనగర కార్పొరేషన్ సిబ్బంది వీరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు.

జాతీయ రహదారి బంద్

జాతీయ రహదారి బంద్

జమ్మూ- కాశ్మీర్ జాతీయ రహదారిని సంపూర్ణంగా మూసి వేశారు. 300 కిలో మీటర్లు ఉన్న ఈ జాతీయ రహదారిలో సుమారు మూడు వేలకు పైగా ట్రక్ లు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

సెలబ్రిటిల ప్రార్థనలు

జమ్మూ కాశ్మీర్ ప్రజలు సురక్షితంగా, క్షేమంగా ఉండాలని పలువురు సెలబ్రిటిలు ట్విట్ చేస్తు ప్రార్థనలు చేశారు.

ప్రాణాలకు తెగిస్తున్న సైనికులు

వరదల భీభత్సం, కొండ చరియలు విరిగి మీద పడుతున్నా లెక్క చెయ్యకుండ సైనికులు సహాయక చర్యలలో పాల్గోంటున్నారు.

సురక్షిత ప్రాంతాలకు

సురక్షిత ప్రాంతాలకు

మహిళలు, చిన్నారులను క్షేమంగా రక్షించి సురిక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద భాదితులకు జమ్మూ అధికారులు, సైనికులు ఆహారం అందిస్తున్నారు.

సర్వం కొల్పోయాం

సర్వం కొల్పోయాం

జమ్మూలోని అనేక జిల్లాలలో 36 ఇండ్లు నేలమట్టం అయ్యాయి. వందలాధి కుటుంబాలు సర్వం కొల్పోయారు. మమ్మలి ఆదుకొండి అంటు ఆర్తనాదాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+