వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ లో మూడు దశాబ్దాల తరువాత : ఆర్ఆర్ఆర్ జోష్ - అనూహ్యం..!!

|
Google Oneindia TeluguNews

కాశ్మీర్ లో మూడు దశాబ్దాల తరువాత అనూహ్యం. ఒకప్పుడు షూటింగ్ లకు కాశ్మీర్ స్వర్గధామం. ఉగ్రవాదుల దాడులు..అలజడి కారణంగా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా అక్కడ షూటింగ్ లు... థియేటర్లు మూత పడ్డాయి. తిరిగి సినిమా థియేటర్లు ఇప్పుడు తెరుచుకోవటం దేశ వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారింది. హిందీ ఫిల్మ్​ ఇండస్ట్రీ కలర్​ సినిమాలను తెరకెక్కిస్తున్న సమయంలో షమ్మి కపుర్​ సాంగ్​ గుల్మార్గ్​లోని థియేటర్లలో హల్​చల్​ చేసింది. "చాహే కోయి ముఝే జంగ్లీ కహే" అని సాగే ఈ పాట అప్పట్లో సూపర్​హిట్​గా నిలిచింది.

పూర్వ వైభవం దిశగా తొలి అడుగు

పూర్వ వైభవం దిశగా తొలి అడుగు

బాలీవుడ్ సినిమా షూటింగ్‌లకు కశ్మీర్ చిరునామాగా ప్రసిద్ధి చెందింది. అప్పటి బాలీవుడ్​ సినిమాల్లో కశ్మీర్ అందాలను అంతలా చూపించారు. అయితే కాశ్మీర్‌లో తీవ్రవాదం చెలరేగాక ఆ ట్రెండ్​ కనుమరుగైపోయింది. తిరిగి..కాశ్మీర్ లోని పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ సినిమా హాళ్లను అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. భవిష్యత్​లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్​ను నెలకొల్పుతామని సిన్హా పేర్కొన్నారు. సినిమాల ప్రదర్శనతో పాటు ఇన్ఫోటెయిన్​మెంట్, స్కిల్ డెవలప్​మెంట్ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత ప్రారంభమైన సినిమా హాళ్లు ఇవేనని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత రాష్ట్రం మొత్తం కేంద్ర పాలనలోకి వెళ్లింది.

అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు

అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు

తిరిగి అక్కడ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. దీని కోసం ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసారు. ఇదే సమయంలో కాశ్మీర్ లో టూరిజంతో పాటుగా గతంలో ఉన్న ఆదరణ తిరిగి షూటింగ్ లు నిర్వహించేనేందుకు వీలుగా కేంద్ర భరోసా ఇస్తోంది. అందులో భాగంగా..ముందుగా సినిమా హాళ్లను తిరిగి ప్రారంభించింది. భవిష్యత్​లో జమ్ములోని ప్రతి జిల్లాలో ఇలాంటి మాల్స్​ను నెలకొల్పుతామని సిన్హా పేర్కొన్నారు. సినిమాల ప్రదర్శనతో పాటు ఇన్ఫోటెయిన్​మెంట్, స్కిల్ డెవలప్​మెంట్ కోసం ఇక్కడ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మూడు దశాబ్దాల తర్వాత ప్రారంభమైన సినిమా హాళ్లు ఇవేనని చెప్పారు. ​1980లో ఈ ప్రాంతంలో దాదాపు 12 థియేటర్లు ఉండేవని, ఉగ్రవాదుల బెదిరింపులతో ఈ హాల్స్​ను మూసివేయాల్సివచ్చింది. 1999లో లాల్​ చౌక్​లోని రిగాల్​ సినిమా థియేటర్​పై గ్రెనేడ్​ దాడి జరగడంతో థియేటర్లను తిరిగి ప్రారంభించాలనే ఆలోచనలను విరమించుకున్నారు.

30 ఏళ్ల తరువాత తొలి మల్టీప్లెక్స్

30 ఏళ్ల తరువాత తొలి మల్టీప్లెక్స్

మధ్యలో అధికారులు ఒప్పించి రెండు థియేటర్లు తెరిపించారు. కానీ, ఆదరణ లభించక తిరిగి మూసేసారు. ఇప్పుడు సినిమా థియేటర్లతో పాటుగా వచ్చేవారం కశ్మీర్​లో తొలి ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుంది. శ్రీనగర్​లోని సోమ్​వార్ ప్రాంతంలో దీన్ని తెరవనున్నారు. 520 సీట్ల సామర్థ్యం కలిగిన మూడు స్క్రీన్లు ఇందులో ఉండనున్నాయి. ఐనాక్స్ హాల్ ప్రారంభమైతే.. మూడు దశాబ్దాల తర్వాత కశ్మీర్‌లో నెలకొల్పిన మల్టీప్లెక్స్​గా ఇది రికార్డుకెక్కనుంది. తిరిగి షూటింగ్స్ జరిగేలా సినీ ఇండస్ట్రీతో ప్రభుత్వంలో ముఖ్యులు సంప్రదింపులు చేస్తున్నారు. వారిలో భరోసా నింపి ..కాశ్మీర్ లో తిరిగి షూటింగ్ ప్రారంభించేలా చర్యలు మొదలు పెట్టారు. ఇక్కడ షూటింగ్ చేసే సినిమాలకు రాయితీలు..ప్రోత్సహకాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. కాశ్మీర్ లో తిరిగి ఈ సందడి ప్రారంభం కావటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్లు ఈ నిర్ణయాలను ఆహ్వానిస్తున్నారు.

English summary
Jammu Kashmir LG Manoj Sinha inaugurted multipurpose cinema halls after 30 years in two districts in Kshmir area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X