త్రిబుల్ తలాక్ బిల్లును వ్వతిరేకిస్తాం... బీజేపీ అలయెన్స్ పార్టీ నేత నితీష్ కుమార్

బిహార్ ముఖ్యమంత్రి,జేడీయు అధినేత నితీష్ కుమార్ బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే తన రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో బీజేపీకి మొండి చేయి చూపించిన నితీష్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోక్‌సభలో మరోసారి ప్రవేశపెట్టనున్న త్రిబుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తామని జేడీయు నేతలు స్పష్టం చేశారు. దీంతో మోడీ, నితీష్‌ల మధ్య కోల్డ్ వార్‌కు తెరలేచినట్టయింది.

మోడీ మంత్రి వర్గంలో చేరని జేడీయు..

మోడీ మంత్రి వర్గంలో చేరని జేడీయు..


మరోసారి బీజేపీ అలయోన్స్ పార్టీ జేడీయూ బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం విప్పనుంది.పార్లమెంట్ ఎన్నికల్లో జేడీయు బీజేపీలు కలిసి పోటి చేసిన నేపథ్యంలోనే బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అడిగిన మంత్రులు పదవులు ప్రధాని మోడీ ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వంలో చేరేందుకు నితీష్ కుమార్ విముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే..ఈనేపథ్యంలోనే రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర్రంలో క్యాబినెట్ విస్తరణ చేసిన నితీష్ ఎనిమిది మంది జేడీయు నేతలకే మంత్రి పదవులు కట్టబెట్టారు. కాగా జేడీయుకు మద్దతు ఇస్తున్న బీజేపీకి ఒక్క స్థానాన్ని మాత్రమే ఇచ్చారు. దీంతోవారు మంత్రి పదవి చేపట్టేందుకు ముందుకు రాలేదు.

బీజేపీపై రివేంజ్ తీసుకుంటున్న నితీష్ కుమార్

బీజేపీపై రివేంజ్ తీసుకుంటున్న నితీష్ కుమార్

కాగ ప్రస్థుతం తమ వ్యతిరేకతను రాజ్యసభలో కూడ తెలిపేందుకు జేడీయు సిద్దమవుతుంది. రాజ్యసభలో మోడీ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా తీసుకురానున్న త్రిబుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో వ్యతిరేకిస్తామని జేడియు మంత్రి శ్యామ్ రజాక్ చెప్పారు. కాగా అంతకు మందు నిర్వహించిన పబ్లిక్ మీటింగ్‌లో సైతం త్రిబుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తాని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో మోడీ రద్దు చేయాలని భావిస్తున్న కశ్మీర్‌లోని 370 ఆర్టికల్ తోపాటు, రామ మందిర నిర్మాణం పై నితీష్ కుమార్ వ్యతిరేకంగా ఉన్నారు. వాటి ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.

త్రిబుల్ తలాక్‌కు ఏన్డీఏ 1లో రాజ్యసభలో విపక్షాల వ్యతిరేకత

త్రిబుల్ తలాక్‌కు ఏన్డీఏ 1లో రాజ్యసభలో విపక్షాల వ్యతిరేకత

గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ముస్లిం మహిళలు ఎదుర్కోంటున్న త్రిబుల్ తలాక్ సమస్యను రూపు మాపేందుకు కేంద్రం త్రిబుల్ తలాక్‌పై నిషేధం విధిస్తూ..బిల్లును తీసుకు రావాలని కేంద్రం నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే గత లోక్‌సభ సమావేశాల్లో త్రిబుల్ తలాక్ బిల్లును ప్రవేశ పెట్టింది. దీంతో లోక్‌సభలో బిల్లు అమోదం లభించింది. కాని ఎన్నికల ముందు హడావిడిగా బిల్లును పెట్టడడంతో రాజ్యసభలో మాత్రం విపక్షాల అభ్యంతరాలతో అమోదం లభించలేదు. అనంతరం ఎన్నికలు రావడంతో లోక్‌సభ రద్దయింది.దీంతో బిల్లుకూడ మురిగిపోయింది.

రెండవ సారి త్రిబుల్ తలాక్ బిల్లు

రెండవ సారి త్రిబుల్ తలాక్ బిల్లు


దీంతో రెండవ సారీ అధికారంలోకి వచ్చిన ఏన్డీఏ ప్రభుత్వం త్రిబుల్ తలాఖ్ బిల్లు పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాల్లో మరోసారి తీసుకురానుంది.. బిల్లును ప్రవేశ పెట్టడడం కోసం కేంద్ర క్యాబినెట్ ఆమోదం కూడ లభించింది. ఈనేపథ్యంలోనే సోమవారం నుండి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును మరోసారి ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు.

రాజ్యసభలో ఆమోదం ఈసారైన వస్తుందా

రాజ్యసభలో ఆమోదం ఈసారైన వస్తుందా

సాధరణంగా ఏదైన బిల్లు ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టినట్ట పాస్ అయినట్టయితే ఆ బిల్లు ఎగువ సభ అయిన రాజ్యసభ అమోదం కూడ పోందాలి..ఇలా రెండు సభల్లో బిల్లు ఆమోదం పొందినప్పుడే అది చట్ట రూపంలోకి వస్తుంది. దీంతో లోక్‌సభలో పూర్తి మెజారీటి ఉన్నా
రాజ్యసభలో మాత్రం బీజేపీకి పూర్తి మెజారీటీ లేదు. ఆపార్టీకి స్వంతగా 70 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యోందుకు ఇతర పక్షాలమీద మోడీ ప్రభుత్వం ఆధారపడాల్సి వస్తుంది. ఈనేపథ్యంలోనే రాజ్యసభలో బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పడంతో ఇతర పార్టీలు ఎలాంటీ నిర్ణయాన్ని తీసుకుంటాయో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+