జనతా పరివార్: లాలూ-నితీష్ ప్లాన్‌కు మాంఝీ చెక్ చెబుతారా?

పాట్నా: సంక్రాంతి పర్వదినం ఒకప్పటి జనతా పరివార్ నుంచి విడిపోయిన చిన్న చిన్న పార్టీలు తిరిగి విలీనం కావడానికి ఒక వేదికగా మారింది. తమ పార్టీల విలీనం ప్రక్రియ కొనసాగుతోందని ఆ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చెప్పుకొస్తున్నారు. జెడి(యు), ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ విడివిడిగా ఏర్పాటు చేసిన మకర సంక్రాంతి విందులకు ఒకప్పటి జనతా పార్టీ భాగస్వాములైన ఐదు పార్టీలకు చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.

ఈ రెండు చోట్లా ఏర్పాటు చేసిన విందుభోజనాలకు జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్, ఐఎన్‌ఎల్‌డికి చెందిన ఓంప్రకాశ్ చౌతాలా, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రతినిధిగా ఉత్తరప్రదేశ్ మంత్రి ఓంఫ్రకాశ్ సింగ్ హాజరై తామంతా ఒకటిగా ఉన్నామనే సందేశాన్ని ఇచ్చారు.

అయితే జెడి(యు) సీనియర్ నేత నితీశ్ కుమార్ మాత్రం ఈ రెండు విందుల్లో కనిపించలేదు. ఇదే విషయాన్ని నితీశ్ సన్నిహిత అనుచరుడైన బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్‌ను మీడియా ప్రశ్నించగా.. నితీశ్ కొన్ని రోజులుగా జ్వరంతో తన నివాసంలోనే ఉంటున్నారని, అందుకే ఆయన విందుకు రాలేదని చెప్పారు.

Janata Parivar merger: Bihar CM Manjhi can ruin Lalu-Nitish's plan

జెడి(యు) రాష్ట్ర అధ్యక్షుడు బశిష్ఠ నారాయణ్ సింగ్ న్యూ పాట్నా ప్రెస్ క్లబ్‌లో, లాలూ ప్రసాద్ తన భార్య రాబ్రీదేవి నివాసంలో ఇచ్చిన రెండు విందులకు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కూడా హాజరయ్యారని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అశోఖ్ చౌధరి, ఆ పార్టీ లెజిస్లేచర్ నాయకుడు సదానంద్ సింగ్ సైతం ఈ విందులకు హాజరై లౌకిక శక్తులకు తమ మద్దతును చాటుకున్నారని చెప్పారు.

బిజెపిని ఓడించడానికి తామంతా ఒకటి కావాలన్న ఆంగీకారానికి వచ్చామని చాటుకోవడానికి మకర సంక్రాంతి ఓ ముఖ్యమైన సందర్భంగా నిలవడం గమనార్హమని అన్నారు. లాలూప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. జనతా పరివార్ మళ్లీ ఒక్కటయ్యే దిశలో ముందుకు సాగుతోందని, ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పటికే దీన్ని సాధించడం జరిగిందని భావించవచ్చని అన్నారు.

దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా.. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్‌కు విలీనాన్ని ప్రకటించే అధికారం ఇవ్వడం జరిగిందని, ఆయనే దీనిపై మాట్లాడుతారని లాలూ చెప్పారు. సమయం గురించి అడగ్గా, తాము మళ్లీ ఢిల్లీలో మరోసారి మాట్లాడుకుంటామని ఆయన తెలిపారు. జనతా పరివార్‌కు చెందిన ఆరు ప్రాంతీయ పార్టీలు తిరిగి ఒక్కటవుతాయన్న నమ్మకాన్ని జెడి (యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ సైతం వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+