జస్వంత్ సింగ్ తలకు గాయం: మోడీ ఫోన్, ప్రార్థన
న్యూఢిల్లీ: బిజెపి మాజీ నాయకుడు జస్వంత్ సింగ్ తలకు పెద్ద దెబ్బ తగిలింది. గత రాత్రి తన నివాసంలో ఆయన నివాసంలో జారి పడండతో ఆయన గాయపడ్డారు. దీంతో ఆయనను ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆస్పత్రిలో చేర్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ జస్వంత్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, వారితో మాట్లాడారు. జస్వంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జస్వంత్ సింగ్ ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఆస్పత్రిని సందర్శించినట్లు సమాచారం.

గత రాత్రి 11 గంటల ప్రాంతంలో జస్వంత్ సింగ్ స్పృహ తప్పి పడిపోయారు. 76 ఏళ్ల జస్వంత్ సింగ్ జారి కింద పడినట్లు తెలుస్తోంది. దీంతో తలకు తీవ్రమైన గాయమైనట్లు చెబుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జస్వంత్ తలకు శస్త్రచికిత్స చేసినట్లు, ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆస్పత్రి సీనియర్ వైద్యుడొకరు చెప్పారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ శుక్రవారం ఉదయమే ఆస్పత్రిని సందర్శించారు.












Click it and Unblock the Notifications