ఒక్క రోజే: టీవీ చానెళ్ల బ్యాన్‌పై జవదేకర్ హెచ్చరిక

న్యూఢిల్లీ: తెలంగాణలో మూడు వారాలుగా ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను నిలిపివేసిన ఎంఎస్‌వోలు, కేబుల్‌ ఆపరేటర్లపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఒక్కరోజు సమయం ఇస్తాం. సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం' అని హెచ్చరించింది.

ఈ అంశంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ మంగళవారం తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావుతో ఈ అంశంపై మాట్లాడారు. పరిస్థితిని చక్కదిద్దాలంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు లేఖ రాసి రెండు వారాలు దాటిందనిస అయినా, కేబుల్‌ ఆపరేటర్లు మారలేదని, ఇప్పటికైనా పరిస్థితి అదుపులోకి తీసుకురావాలని, చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించేలా చూడాలని ఆయన కేశవరావుకు సూచించారు.

Javadekar warns on TV news channels ban in Telangana

సమస్యను రాజకీయంగా పరిష్కరించేందుకు మరో రోజు గడువు ఇస్తామని, ఆ తర్వాత చట్టం ప్రకారం కేబుల్‌ ఆపరేటర్లపై చర్య తీసుకుంటామని తనను కలిసిన మీడియా ప్రతినిధులకు జవదేకర్‌ తెలిపారు. కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ (నియంత్రణ) చట్టం ప్రకారం ఒక చానల్‌ను నిషేధించే అధికారం కేబుల్‌ ఆపరేటర్లకు లేదని అధికారులు మంత్రికి చెప్పినట్లు తెలిసింది.

నిబంధనల ప్రకారం కేబుల్‌ ఆపరేటర్లు తమ చందాదారులు, చందాల వివరాలపై నివేదికలు సమర్పించాలని, చట్టాన్ని ఉల్లంఘిస్తే వారి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్రానికి ఉందని ఆయన అన్నారు. 2011లో చేసిన చట్టం ప్రకారం రిజిసే్ట్రషన్‌కు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే వారి లైసెన్సును కూడా రద్దు చేయవచ్చునని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+