సుప్రీం కోర్టు తీర్పు: శశికళ జయా గ్రూప్ టీవీ చానల్స్ లో ఏం వచ్చిందంటే !
శశికళ యాజమాన్యంలోని జయా గ్రూప్ టీవీ చానల్స్ మంగళవారం సుప్రీం కోర్టు తీర్పు గురించి ఒక్క వార్త కూడా ప్రసారం చెయ్యలేదు. ఎంజీఆర్ నటించిన పాత సినిమాలను టీవీల్లో ప్రసారం చేస్తూ కాలం గడిపేశారు.
చెన్నై: తమిళనాడు సీఎం కావాలని కలలు కని చివరికి జైలుకు వెలుతున్న శశికళకు ఆమె యాజమాన్యంతో నడుస్తున్న టీవీ చానెల్స్ మంగళవారం మౌనపోయాయి. దేశంలోని అన్ని మీడియా చానల్స్ జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు శిక్ష పడుతుందా ? లేదా ? అంటూ ఆసక్తిగా వార్తలు ప్రసారం చేశాయి.
కొన్ని అంతర్జాతీయ మీడియా చానల్స్ సైతం శశికళ భవిష్యత్తు ఏమిటీ ? అని ఆసక్తిగా గమనిస్తూ ఏప్పటికప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. జయలలిత మరణం తరువాత ఆమె యాజమాన్యంలోని జయ గ్రూప్ టీవీ చానల్స్ శశికళ చేతిలోకి వెళ్లిపోయాయి. మంగళవారం జయా గ్రూప్ చానల్స్ మాత్రం ఒక్కటంటే ఒక్క వార్త ప్రసారం చెయ్యలేదు.

ఎంజీఆర్ నటించిన పాత సినిమాలను టీవీల్లో ప్రసారం చేస్తూ కాలం గడిపేశారు. చిన్నమ్మ భక్తి చాటుకోకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయని అనుకున్న జయా టీవీ గ్రూప్స్ సిబ్బంది కేవలం సినిమాలు మాత్రం ప్రసారం చేసాయి. అంతే కాకుండా కొన్ని కామిడీ క్లిప్పింగ్స్ వేసుకుంటూ దేశంలో ఏమీ జరగలేదని ప్రజలను మభ్యపెట్టటానికి ప్రయత్నించారు.
అయితే బుల్లితెర వీక్షకులను మోసం చెయ్యడం అంత సులభం కాదని తెలీదు పాపం ఈ టీవీ చానల్ నిర్వహకులకు. ప్రేక్షకులు మాత్రం టీవీ చానల్స్ తిప్పేసి వేరే తమిళ చానల్స్ చూస్తూ ఏం జరిగింది అని ఆసక్తిగా తెలుసుకున్నారు. మొత్తం మీద జయలలిత మరణించిన విషయంలో మొదట జయా టీవీలోనే అమ్మ ఇక లేరు అని ప్రసారం అయ్యింది.
డిసెంబర్ 5వ తేది సాయంత్రం 5.45 గంటల సమయంలో జయలలిత మరణించారని జయా టీవీ చానల్ లో ప్రసారం అయిన తరువాత శశికళ ఆదేశాల మేరుకు కేవలం 7 నిమిషాల వ్యవధిలో పోరపాటు జరిగిందని జయా టీవీ వివరణ ఇచ్చింది. అయితే అదే రోజు అర్దరాత్రి జయలలిత మరణించారని జయా టీవీ అధికారికంగా దృవీకరిస్తూ వార్తలు ప్రసారం చేసింది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications