వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పన్నీరు నాలుగోసారి సీఎం అవుతారు: శశికళకు స్టాలిన్

సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం పన్నీరు సెల్వం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ సోమవారం నాడు షాకింగ్ కామెంట్స్ చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన అనంతరం పన్నీరు సెల్వం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని డిఎంకే అధ్యక్షులు స్టాలిన్ సోమవారం నాడు షాకింగ్ కామెంట్స్ చేశారు. తద్వారా శశికళ చిక్కుల్లో పడతారని అభిప్రాయపడ్డారు. జయ ఆస్తుల కేసుపై వారం రోజుల్లో తీర్పు చెబుతామని సుప్రీం తెలిపిన విషయం తెలిసిందే.

శశికళకు.. జయలలిత ఎప్పుడు కూడా ఏ పదవి ఇవ్వలేదని స్టాలిన్ చెప్పారు. శశికళ ఎన్నికను తాము ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నిస్తామని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కేవలం 1.1 శాతం ఓటు షేరుతోనే ఓడిపోయిందన్నారు.

తమిళనాడులో ముఖ్యమంత్రి మార్పు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిదంబరం స్పందించారు. గతంతో పోలిస్తే తమిళనాడు పరిస్థితులు భిన్నంగా మారాయని ఆయన అన్నారు.

Jaya never gave Sasikala a job in the party, says Stalin

గతంలో గర్వంగా చెప్పుకునేలా ఉండేదని, ఇప్పుడు మాత్రం తమిళనాట ప్రజానీకం, నాయకులు దానికి పూర్తిగా విరుద్ధంగా వెళ్తున్నారని ట్వీట్ చేశారు. తమిళనాడు, అన్నాడీఎంకే నాయకులు విరుద్ధంగా వెళ్తున్నారని చెప్పారు.

కాగా, అన్నాడీఎంకే శాసన సభా పక్ష నేతగా శశికళ ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో పలువురు అసమ్మతి నేతలు, విపక్షాలు, నెటిజన్లు మండిపడుతున్నారు. దీనిపై అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ పుష్ప ఈసీకి, ప్రధాని మోడీకి లేఖ రాశారు.

English summary
AIADMK legislators have chosen V K Sasi kala as chief minister against the wishes of the people of Tamil Nadu, said DMK working president M K Stalin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X