చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'సీఎంగా జయలలిత, 150 రోజుల వండర్': ఇదీ ప్రస్థానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత మళ్లీ ముఖ్యమంత్రిగా చేపట్టడం 150 రోజుల వండర్ అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి శనివారం ఎద్దేవా చేశారు. ఆయన ట్విట్టర్‌లో ఈ ట్వీట్ చేశారు. 'తమిళనాడు సీఎంగా జేజే(జయలలిత). మరో 150 రోజుల వండర్' అని అతను పేర్కొన్నారు.

జయలలిత శనివారం నాడు తమిళనాడు 29వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత రాజకీయ ప్రస్థానం. ఆమె రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చోటుచేసుకున్నాయి. ఐదోసారి ఆమె సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలిత రాజకీయ ప్రస్థానం..

1991 జూన్ 24న తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. 1996లో అవీనితి అన్నాడీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో ఘోర పరాజయం. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు. 1996 జూలై 11న జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దాఖలు చేశారు.

Jaya sworn in TN CM for fifth time; Swamy calls it 'another 150 day wonder'

1991-96 మధ్యకాలంలో రూ.66.65 కోట్లు ఆర్జించారని ఆరోపణలు. 1996 డిసెంబర్ 7న జయలలిత అరెస్టు. 1997 ఏప్రిల్‌లో కరుణానిధి ప్రభుత్వం జయ కేసులు విచారణకు మూడు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసింది. అన్నాడీఎంకే అధినేత్రిపై మొత్తం 47 అవినీతి కేసును నమోదు.

1997 జయలలిత పై ప్రాసిక్యూషన్ ప్రారంభం. 1997 జూన్ 4న జయలలిత, శశికళ, మరో ఇద్దరిపై చెన్నై కోర్టులో అక్రమాస్తుల కేసు నమోదు. 1999లో బొగ్గు దిగుమతికి సంబంధించి ప్రత్యేక కోర్టులో చార్జిషీట్. హైకోర్టు సమర్థన.
2000 ఫిబ్రవరి 2న ప్లీసెంట్ స్టే హోటల్ కేసులో జయ దోషిగా తీర్పు

అక్రమాస్తుల కేసులో విచారణ ముమ్మరం. 2000 ఆగస్టు నాటికి 250 మంది సాక్షుల విచారణ. 2000 అక్టోబర్‌లో టాన్సీ భూముల డీల్ కేసులో జయలలితను దోషిగా తేల్చిన చెన్నై కోర్టు. 2001 మే 14న అన్నాడీఎంకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం.

2001 సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. టాన్సీ కేసులో దోషిగా నిర్ధారణ అయినందున సుప్రీం అనర్హతగా ప్రకటించింది. 2002 డిసెంబర్ 4న జయకు టాన్సీ, ప్రీసెంట్ హోటల్ కేసు నుంచి చెన్నై హైకోర్టు విముక్తి. 2002 ఫిబ్రవరి 21న అండిపట్టి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జయ ఘనవిజయం.

2002 మార్చి 2న ముఖ్యమంత్రిగా జయ ప్రమాణ స్వీకారం. అక్రమాస్తుల కేసులో ముగ్గురు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ రాజీనామా. కొందరు సాక్షులు వెనక్కు తగ్గారు. 2003 నవంబర్ 18న డీఎంకే కేసు పిటిషన్ దాఖలు. జయలలిత అక్రమాస్తుల కేసును బెంగళూరుకు బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు. అనంతరం న్యాయస్థానం దోషిగా తేల్చింది. హైకోర్టు ఇటీవల జయలలితను నిర్దోషిగా తేల్చింది.

English summary
AIADMK general secretary Jayalalithaa was today sworn in for the fifth time as Chief Minister of Tamil Nadu amid celebrations by party cadres and supporters all over the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X