ఆంధ్రాలో జయలలిత కారు సీజ్: ఆత్మకు భయపడి వదిలేశారా!

చిత్తూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఉపయోగించిన పాత కారును ఆంధ్రపద్రేశ్ లోని చిత్తూరు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిర్జనప్రదేశంలో ఆ కారును గుర్తు తెలియన వ్యక్తులు వదిలి వెళ్లారని పోలీసు అధికారులు అంటున్నారు.

చిత్తూరు జిల్లాలోని కేవీబీ పురం మండలంలోని ఆరోం గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలో కారు నిలిపి ఉన్న విషయం స్థానికులు గుర్తించారు. అయితే తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న ఆ కారు అక్కడి నుంచి ఎంత వరకు కదలకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

స్థానిక సబ్ ఇన్స్ పెక్టర్ పరుశురాముడు సంఘటనా స్థలానికి చేరుకుని కారులోని పత్రాలు పరిశీలించారు. టీఎన్ 07-వీ 1948 నెంబరు ఉన్న కారు మొదట జయలలిత పేరుతో రిజిస్టర్ అయ్యిందని ఎస్ఐ పరుశురాముడు గుర్తించారు.

Jayalalitha's car which was she used earlier has been found near Chittoor in Andhra Pradesh.

జయలలిత తరువాత ఆ కారును వేరే వ్యక్తికి విక్రయించారని, ఆయన మరో వ్యక్తికి ఆ కారును విక్రయించారని పత్రాలలో వెలుగు చూసిందని ఎస్ఐ పరుశురాముడు చెప్పారు. అయితే ఆ కారు యజమాని ఎందుకు ఇక్కడ వాహనం వదిలిపెట్టి వెళ్లారో అర్థం కావడం లేదని, విచారణ చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.

ఈ విషయంపై ఆంధ్రపద్రేశ్ పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. జయలలిత ఆత్మకు భయపడి ఆ కారు అక్కడ వదిలిపెట్టి వెళ్లి ఉంటారని కేవీబీ పురం మండలంలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత కారు యజమాని చిరునామా తెలుసుకున్న పోలీసులు ఆయనను విచారించడానికి ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+