'శశికళ ఫ్యామిలీని జయ ఆత్మ చంపేస్తుంది', సీఎం పళనిస్వామి సేఫ్!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: శశికళను, ఆమె కుటుంబాన్ని దివంగత జయలలిత ఆత్మ చంపడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వం వర్గం ఎమ్మెల్యే సెమ్మాలై బుధవారం నాడు అన్నారు. మన్నార్‌గుడి కుటుంబాన్ని జయలలిత ఆత్మ అసలు వదిలి పెట్టదని వ్యాఖ్యానించారు.

చిన్నమ్మ కథ అడ్డం తిరిగింది!: పార్టీ చీఫ్ ఇప్పటికీ శశికళనే.. కానీ?

అన్నాడీఎంకే

అన్నాడీఎంకే

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళను, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా టిటివి దినకరన్‌ను పన్నీరుసెల్వం వర్గం ఏమాత్రం అంగీకరించడం లేదు. వారిని తొలగిస్తే అన్నాడీఎంకేలోని ఇరువర్గాలు కలుస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నీరు వర్గం నేత సెమ్మాలై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శశికళను తొలగించవచ్చా?

శశికళను తొలగించవచ్చా?

అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను తప్పించాల్సిందేనని పన్నీరుసెల్వం కుండబద్దలు కొట్టడంతో చిన్నమ్మతో పాటు దినకరన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆ ప్రకటన కాగితాల వరకు వచ్చే వరకు సమయం తీసుకుంటుంది.

శశికళ ఎంపిక అంశం ఇప్పుడు ఈసీ కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో మరింత సమయం తీసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి తనను కలిసిన నేతలతో పళని స్వామి మాట్లాడుతూ.. శశికళను ఎలా తొలగించగలం అని ప్రశ్నించారని తెలుస్తోంది.

122 మంది ఎమ్మెల్యేలు, 20 మంది మంత్రులు

122 మంది ఎమ్మెల్యేలు, 20 మంది మంత్రులు

శశికళను, దినకరన్‌ను పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నట్లు అన్నాడీఎంకే పార్టీకి చెందిన 122 మంది ఎమ్మెల్యేలు, 20 మంది మంత్రులు తీర్మానం చేశారు. పన్నీరుసెల్వంకు ఆర్థిక శాఖ ఇవ్వాలని నిర్ణయించారు. అన్నాడీఎంకే నిర్ణయంతో శశికళ రాజకీయ జీవితం ముగిసినట్లేనని భావిస్తున్నారు.

పళని ప్రభుత్వానికి ముప్పు లేనట్లే

పళని ప్రభుత్వానికి ముప్పు లేనట్లే

తన వైపు ఎమ్మెల్యేలు ఉన్నారని, అవసరమైతే ప్రభుత్వాన్ని పడగొడతానని దినకరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రభుత్వ బల నిరూపణకు అవసరమైన 117 మంది ఎమ్మెల్యేల మద్దతు పళనిస్వామికి ఉంది. శశికళను, దినకరన్‌లను తొలగింస్తున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు సహా 122 మంది ప్రకటించారు.

పన్నీరు మద్దతు

పన్నీరు మద్దతు

పళనిస్వామి ముఖ్యమంత్రిగా ఉండాలని పన్నీరుసెల్వం వర్గం కూడా చెప్పింది. అయితే పన్నీరుకు ఆర్థిక శాఖ ఇవ్వాలని షరతు విధించింది. మొత్తంగా 122 మంది మద్దతు పళనిస్వామికి ఉంది. ఆరుగురి నుంచి పదిమంది ఎమ్మెల్యేల వరకు మాత్రమే దినకరన్ వైపు ఉన్నారు. ఈ సంఖ్య పెరిగితే తప్ప పళనిస్వామి ప్రభుత్వానికి ముప్పు లేనట్లే.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
OPS support MLA Semmalai says in a function that Jayalalitha soul will kill sasikala family. Jayalalitha 's soul will never leave Sasikala family he said.
Please Wait while comments are loading...