వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత సెంటిమెంట్: నేతలు వంగి నమస్కరించారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సెంటిమెంట్ ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఆమె సోమవారం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో ఆమె సెంటిమెంట్‌గా ఆకుపచ్చ చీర ధరించి వచ్చారు. ఆమెకు నెంబర్ సెంటిమెంట్ ఉన్న విషయం తెలిసిందే.

జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన కొన్ని హామీల పత్రాలపై సంతకాలు చేశారు. రుణమాపీ, మద్యం దుకాణాల మూసివేత, ఉచిత విద్యుత్, నూతన వధూవరులకు బంగారం తదితరాల పైన సంతకాలు చేశారు.

ఇదిలా ఉండగా, జయలలిత సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమయంలో అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు సందడి చేశారు. జయ ప్రమాణ స్వీకారం చేసి తన స్థానంలోకి వెళ్తుంటే... కొందరు నేతలు తలవంచి నమస్కరించారు. ఇది ఆసక్తిని కలిగించింది.

మరోవైపు, జయలలిత ప్రమాణ స్వీకారం సందర్భంగా చెన్నైలో ఎక్కడ కూడా బ్యానర్లు, కటౌట్ల హడావుడి కనిపించలేదు. సాధారణంగా ప్రమాణ స్వీకారం చేస్తే పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు వెలుస్తాయి. కానీ ఈసారి అమ్మ ప్రమాణం సందర్భంగా అవి పెద్దగా కనిపించలేదు.

జయలలిత ప్రమాణం

జయలలిత ప్రమాణం

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణస్వీకారం చేశారు. శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమె వరుసగా రెండో పర్యాయం సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

 జయలలిత ప్రమాణం

జయలలిత ప్రమాణం

మద్రాస్‌ యూనివర్శిటీ సెంటినరీ సమావేశ మందిరంలో రాష్ట్ర గవర్నర్‌ కొణిజేటి రోశయ్య... జయలలితతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మద్రాస్‌ యూనివర్శిటీ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

 జయలలిత ప్రమాణం

జయలలిత ప్రమాణం

జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఇది ఆరోసారి. ఎంజీఆర్‌ తర్వాత వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేతగా ఆమె రికార్డు సృష్టించారు.

 జయలలిత ప్రమాణం

జయలలిత ప్రమాణం

జయలలితతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మాదిరిగానే మంత్రులందరూ సామూహికంగా ప్రమాణం చేశారు. జయ కేబినెట్‌లో ఈసారి 13 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు.

 జయలలిత ప్రమాణం

జయలలిత ప్రమాణం

జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, కరుణానిధి తనయుడు స్టాలిన్‌, సినీనటుడు శరత్ కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

English summary
Chennai people are surprised as they couldn't see banners and cut outs of Jaya on the day she took oath as CM for the sixth time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X