జయలలిత: ప్రత్యేక టెక్నాలజీతో అమ్మ మొబైల్ ఫోన్లు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో 'అమ్మ' పేరు మీద కొత్త కొత్త పథకాలు వచ్చి చేరుతున్నాయి. తాజాగా, 'అమ్మ మైబైల్ ఫోన్'ల పేరుతో తమిళనాడు ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఇప్పటికే మినరల్ వాటర్, సిమెంట్, అమ్మ క్యాంటీన్లు.. ఇలా ఎన్నో జయలలిత ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
తాజాగా, సోమవారం అమ్మ మొబైల్స్ పేరుతో ముఖ్యమంత్రి జయలలిత ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. తొలి దశలో రూ.15కోట్ల వ్యయంతో 20 వేల ముబైల్ ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా స్వయం సహాయక బృందాల శిక్షకులకు ఉచితంగా అమ్మ ముబైల్ ఫోన్లను అందించనున్నారు.

అమ్మ మొబైల్ ఫోన్లలో ప్రత్యేక సాఫ్టువేర్ కూడా ఉంటుంది. అమ్మ మొబైల్స్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్వయం సహాయక బృందాల సమావేశాలు, లోన్లు, పేమెంట్స్.. తదితరాలను నిక్షిప్తం చేసుకునేలా, వివరాలు తెలిసేలా ఆ మొబైల్ ఫోన్స్ ఉన్నాయని తెలుస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలో 6.08 లక్షల స్వయం సహాయక బృందాలు ఉన్నాయి. వీటిల్లో 92 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. అమ్మ మొబైల్ ఫోన్‌ల పైన స్వయం సహాయక బృందాలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications