జయలలిత ఎఫెక్ట్: అపోలో నుంచి ముందే పేషెంట్ల తరలింపు
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన మరికొద్దిసేపట్లో కీలక ప్రకటన రానుంది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అపోలో ఆసుపత్రికి వస్తున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన కీలక ప్రకటన వచ్చింది. ఆమె మృతి చెందినట్లు వెల్లడించారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తదితరులు అపోలోకి వచ్చిన తర్వాత ప్రకటన వెలువడుతుందని వార్తలు వచ్చాయి. కానీ స్థానిక టీవీ ఛానల్లో విషయం తెలియడంతో అభిమానులు అపోలో ఆసుపత్రికి వచ్చారు.
జయలలిత ఆరోగ్యం విషమించిన నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలోని ఇతర పేషెంట్లను వేరే చోటకు తరలించారు. ఇతర పేషెంట్లను దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. ఎలాంటి ప్రకటన వెలువడినా ఇతర పేషెంట్లకు ఇబ్బందులు కలగుండా ఉండేందుకు తరలిస్తున్నారు.

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర భేటీ
జయలలిత ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్న నేపథ్యంలో అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు కాసేపట్లో భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అత్యవసర సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. జయలలిత ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద బారికేడ్లుతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications