జయలలిత ఆస్తుల కేసు: ఇలా సాగింది...

చెన్నై: ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలితకు భారీ ఊరట లభించిన విషయం తెలిసిందే. జయలలితపై నమోదైన ఆభియోగాలను అన్నింటినీ కర్ణాటక హైకోర్టు కొట్టేసి ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. జయలలిత ఆస్తుల కేసు సుదీర్ఘంగా పలు మలుపులతో కొనసాగింది. ఆ కేసు ఇలా సాగింది.

- 1991 నుంచి 1996 వరకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమ ఆస్తులను కూడబెట్టారంటూ బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామి స్పెషల్ కోర్టులు కేసు దాఖలు చేశారు.

- రూ.66 కోట్లకు పైగా కూడబెట్టారంటూ నమోదైన కేసులో 1996 డిసెంబర్ 7వ తేదీన జయలలిత అరెస్టయ్యారు.

- జయలలితతో పాటు మరో ముగ్గురిపై నమోదైన ఆస్తుల కేసులో 1997లో సెషన్స్ కోర్టులో కేసు విచారణ ప్రారంభమైంది.

Jayalalithaa DA case: Time line

- 1997 జూన్ 4వ తేదీన 120 - బి ఐపిసి, 13 (2), 13(1) సెక్షన్ల కింద చార్జీషీట్ నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- 1997లో జయలలిత దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది.

- అదే కేసులో అప్పటి గవర్నర్ ఫాతిమా బీవీపై విచారణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

- 2000 ఆగస్టులో కోర్టు 250 మంది సాక్షులను విచారించింది.

- 2000 అక్టోబర్‌లో తమిళనాడు లఘు పరిశ్రమల శాఖలో అవినీతి పాల్పడినట్లు జయలలితపై అభియోగాలు నమోదయ్యాయి.

- ఆ కేసులో నమోదైన అభియోగాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.

- 2001లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. అన్నాడియంకె పూర్తి మెజారిటీతో విజయం సాధించింది.

- అభియోగాలు నమోదు కావడంతో ఎన్నికలకు దూరంగా ఉన్న జయలలిత ఆ తర్వాత ఉప ఎన్నికల్లో గెలిచి 2002 ఫిబ్రవరి 21వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

- 2003లో డిఎంకె ప్రధాన కార్యద్రశి కె. అన్ బాంజ్ గాన్ ఆ కేసు విచారణను తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

- జయలలిత ముఖ్యమంత్రిగా ఉండడంతో ఆ కేసును పక్కదోవ పడుతుందని పిటిషన్‌లో ఆరోపించారు. అందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలియజేయడంతో కేసు విచారణ కర్ణాటకకు బదిలీ అయింది.

- 2014 సెప్టెంబర్ 27వ తేదీన అక్రమాస్తుల కేసులో జయలలిత, శశికళ, సుధాకరన్, ఇళవరసిలను స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. వారికి నాలుగేళ్ల జైలు శిక్ష విధఘించింది. జయలలితకు జైలు శిక్షతో పాటు వంద కోట్ల రూపాయల జరిమానా విధించింది.

- 2014 సెప్టెంబర్ 29వ తేదీన తీర్పును సవాల్ చేస్తూ జయలలిత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు

- 2014 అక్టోబర్ 7వ తేదీన జయలలిత బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ ఇవ్వడానికి తగిన కారణాలు లేవని స్పష్టం చేసింది.

- 2014 అక్టోబర్ 9వ తేదీన బెయిల్ ఇవ్వాలని కోరుతూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- 2014 అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు జయలలితకు బెయిల్ మంజూరు చేసింది.

2015 మే 11వ తేదీన అక్రమాస్తుల కేసులో జయలలితను, మరో ముగ్గురిని కర్ణాటక హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

కోర్టు దోషిగా తేల్చడంతో జయలలిత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె స్థానంలో పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తిరిగి జయలలిత ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసేవరకు కూడా ఆమె జైలులోనే ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+