వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం: షీలా చేతికి జయ సీల్డ్ కవర్? మరో ఎదురుదెబ్బ

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం పైన అన్నాడీఎంకే అధినేత్రి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఒక సీల్డ్ కవర్‌ను ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్‌కు ఇచ్చి పంపించినట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం జరిగే పార్టీ సమావేశంలో అభ్యర్థిని ప్రకటించవచ్చునని తెలుస్తోంది.

కాగా, జయలలిత జైలుకు వెళ్లడంతో ముఖ్యమంత్రి రేసులో మంత్రి పన్నీర్ సెల్వం పేరు ప్రముఖంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే.

రాగిముద్ద, సాంబారు, ఆవకాయతో జయ భోజనం

జయలలిత శనివారం రాత్రి బెంగళూరు సెంట్రల్ జైలులో సాధారణ ఖైదీల మాదిరే సాదాసీదా భోజనం చేయాల్సి వచ్చింది. శనివారం సాయంత్రం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయలలితకు శిక్ష ఖరారు చేయగానే పోలీసులు ఆమెను పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. రాత్రి కాగానే జైలులోని ఖైదీలకు అందించే భోజనాన్ని ఆమెకు కూడా అందజేశారు. ఈ భోజనంలో రాగిముద్ద, సాంబారుతో పాటు పెరుగన్నం కూడా ఉందని జైలు సిబ్బంది వెల్లడించారు. పెరుగన్నం, ఆవకాయ పచ్చడిని తిన్నారు. కాగా, జయలలిత ఉదయం ఐదింటికి లేచారు. జైలు ప్రాంగణంలో మార్నింగ్ వాక్ చేశారు. పత్రికలు చదివారు.

జయలలిత

జయలలిత

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు వివీఐపీ సెల్ నెంబర్ 23లో ఉంచారు.

జయలలిత

జయలలిత


అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరు జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఆమెకు మొదటి రోజు లోపల సెక్యూరిటీ అరెంజ్‌మెంట్స్ చేసేందుకు ఎలాంటి గార్డులు లేరట.

 జయలలిత

జయలలిత

కాగా, అక్రమాస్తుల కేసులో జైలు శిక్షకు గురైన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి హోదాలో జయలలితకు లభిస్తున్న ప్రభుత్వ సౌకర్యాలన్నీ రద్దు చేయాని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

 జయలలిత

జయలలిత

సామాజిక ఉద్యమకర్త 'ట్రాఫిక్' రంగస్వామి దాఖలు చేసిన ఈ పిల్ పై జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ మహదేవన్ లతో కూడిన మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ అత్యవసర విచారణకు అంగీకరించింది. నేటి మధ్యాహ్నం ఈ పిటిషన్ పై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.

 జయలలిత

జయలలిత

అవినీతి నిరోధక చట్టం కింద దోషిగా తేలిన జయలలితకు ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు పొందే అర్హత లేదని, ఆమె మంత్రివర్గ సహచరులు కూడా ఆ అర్హత కోల్పోయారని రంగస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. జయలలిత అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న అల్లర్లను కూడా అణచివేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.

English summary
After a special court in Bangalore convicted AIADMK general secretary Jayalalithaa to four years imprisonment in the disproportionate assets case, depriving her the chief ministerial post, the ruling party MLA will meet on Sunday evening to decide the next course of action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X