జయ ఆరోగ్యంపై గందరగోళం: చనిపోయిందని వదంతులు, అపోలో తాజా షాకింగ్ ప్రకటన
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన షాకింగ్ ట్విస్ట్. ఓ వైపు తమిళ చానళ్లలో ఆమె మృతి చెందినట్లుగా వదంతులు వస్తున్నాయి.
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం పైన షాకింగ్ ట్విస్ట్. ఓ వైపు తమిళ చానళ్లలో ఆమె మృతి చెందినట్లుగా వదంతులు వస్తున్నాయి. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున విధ్వంసానికి దిగారు.
అయితే, అపోలో యాజమాన్యం మాత్రం తాజాగా ఆశ్చర్యకర ప్రకటన చేసింది. జయలలితకు చికిత్స కొనసాగుతుందని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. జయలలితను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. జయలలిత చనిపోయిందని వదంతులు వచ్చాయని, వాటిలో ఎలాంటి నిజం లేదని అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. తాజాగా, జయ ఆరోగ్యంగా ఉందని హెల్త్ బులెటిన్ విడుదల కావడం గమనార్హం.
జయ ఆరోగ్యం విషమంగా ఉందని తెలిపారు. ఎయిమ్స్ వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. అపోలో ఈడీ సంగీతా రెడ్డి కూడా ట్వీట్ చేశారు. అపోలో డాక్టర్ల బృందం, ఎయిమ్స్ వైద్యులు అమ్మకు చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.
A large team of doctors from Apollo and AIIMS continue to provide all life saving measures. #GodblessAmma @shobanakamineni
— Sangita Reddy (@SangitaApollo) 5 December 2016












Click it and Unblock the Notifications