జయలలిత కోసం మృతి: 193 కుటుంబాలకు సాయం

చెన్నై/న్యూఢిల్లీ: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన కోసం మరణించిన, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు సాయం చేయనున్నారు. జయలలిత జైలుకు వెళ్లిన విషయం తెలిసి రాష్ట్రంలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. కొందరు ఆత్మహత్యాయత్నం చేశారు.

193 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2,93,000 చొప్పున జయలలిత నష్టపరిహారం అందజేయనున్నారు. సెప్టెంబర్ 27న బెంగళూరు ప్రత్యేక కోర్టు జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురు జయ అభిమానులు తీవ్ర ఆవేదన, నిరాశతో చనిపోయారు.

చర్చలతోనే సమస్యల పరిష్కారం

లోకంలో పరిష్కారం కాని సమస్య అంటూ ఏదీ ఉండదని భారత్ స్పష్టం చేస్తూ, పాకిస్తాన్‌తో తమకు ఉన్న అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నామని, అయితే ఆ గడ్డపై నుంచి భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలను అది సమర్థవంతంగా అదుపు చేయాల్సిన అవసరం ఉందని, దేశ సర్వసత్తాకత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ఆర్థికంగా శరవేగంగా ఎదుగుతున్న చైనాతో సత్సంబంధాలను నెలకొల్పుకోవాలని మన దేశం కోరుకుంటోందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం అన్నారు.

 Jayalalithaa pledges compensatory payments of $4,800

పరస్పర సంప్రదింపులు, చర్చల ద్వారా పొరుగు దేశాలతో మా సమస్యలన్నిటినీ పరిష్కరించుకోవాలని మనం అనుకుంటున్నామని, చర్చల ద్వారా పరిష్కారం కాని సమస్య ఏదీ లేదని ఆయన అన్నారు. ఇటీవల సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పుల ఒప్పందం ఉల్లంఘనలు పెరిగిపోయిన నేపథ్యంలో దోవల్ ఈ వ్యాఖ్యలు చేశారని, అయితే మరోవైపు ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో అది సమర్థవంతంగా దాన్ని అదుపు చేయాలని కూడా భారత్ ఆశిస్తోందన్నారు.

పొరుగు దేశాలన్నిటితోను స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉండాలన్నదే భారత్ విధానమని ఆయన స్పష్టం చేస్తూ భారత దేశ ఆర్థికాభివృద్ధి పొరుగు దేశాలను దానికి చేరువ చేస్తుందన్నారు. పొరుగు దేశలతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించుకోవడం చాలా ముఖ్యమని నేను అనుకుంటున్నానని, భారతదేశ ఆర్థికాభివృద్ధి ఈ ప్రాంతంలోని దేశాలన్నిటినీ ఒక్కటి చేస్తుందని, భారత దేశం అభివృద్ధి చెందడం వల్ల ఈ దేశాలకు సైతం మరిన్ని అవకాశాలు లభిస్తాయని, తమను చిన్నచూపు చూస్తున్నారని ఆ దేశాలు అనుకోవలసిన అవసరం లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+