జయలలిత వంటమనిషిపై హత్యాయత్నం, వరుస ఘటనలతో అనుమానాలు
తమిళనాడు రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకొంటున్న ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంచవర్ణం అనే వ్యక్తిపై శనివారం నాడు గుర్తుతెలియని వ్యక్
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకొంటున్న ఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో వంటమనిషిగా పనిచేసిన పంచవర్ణం అనే వ్యక్తిపై శనివారం నాడు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు.అయితే ఆయన తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఏస్టేట్ లో దొంగతనం తర్వాత వరుసగా హత్యలు చోటుచేసుకొన్నాయి.ఈ దాడికి కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్న ఇద్దరు వ్యక్తుల్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.అయితే ఓ వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించగా, మరోకరు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.

మరో వైపు జయలలిత వద్ద వంటమనిషిగా పనిచేసిన పంచవర్ణంపై శనివారం నాడు కూడ గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు.అయితే ఈ ప్రమాదం నుండి ఆయన తృటిలో తప్పించుకొన్నాడు.
శివగంగ జిల్లాకు చెందిన పంచవర్ణం జయ ఇంట్లో వంటమనిషిగా పనిచేశారు. ఆయన కుమారుడు అన్నాడిఎంకె ప్రభుత్వహయంలో పౌరసంబంధాల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా నియమితులయ్యారు.ఈ దాడికి సంబంధించి పైదాపేట పోలీసులు కేసును తీసుకోకపోవడంతో బాధితులు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఆళగును మురుగేషన్ ను ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications