వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదను చూసి కొట్టారు: బిజెపిని చిక్కుల్లో పెట్టిన జయ

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడిఎంకె అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత... అసెంబ్లీ ఎన్నికలకు ముందు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా 'నళిని' అస్త్రంతో ప్రతిపక్షాలకు జయలలిత షాకిచ్చారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జయలలిత తమిళనాడులో 40 లోకసభ సీట్లకు 37 చోట్ల గెలిచారు.

ఇందుకు.. అప్పట్లో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలి వేలూరు జైలులో 24 ఏళ్లుగా ఖైదుగా ఉన్న వారిని విడుదల చేయాలని ఆమె పార్లమెంటు ఎన్నికలకు ముందు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి డిఎంకె, డిఎండికె, పిఎంకె వంటి పార్టీలు సైతం మద్దతు పలకవలసి వచ్చింది.

యూపిఏ ప్రభుత్వం దీనిపై సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆ వ్యవహారం అక్కడికి ఆగింది. అయితే, గత లోకసభ ఎన్నికల్లో ఇది జయలలితకు చాలా లాభం చేసింది. ఆ పార్టీ ఏకంగా 37 లోకసభ స్థానాలను గెలుచుకుంది. రాజీవ్ హంతకుల పైన, ఎల్టీటీఈ పైన తమిళ ప్రజలకు ఉన్న సానుభూతిని ఆమె క్యాష్ చేసుకున్నారు.

Jayalalithaa's missive Rajiv assassins puts Centre in a bind

ఇప్పుడు.. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె మరో అస్త్రాన్ని ముందుకు తీసుకు వచ్చారు. చాలాకాలంగా జైలు జీవితం గడుపుతున్న మురుగన, శాంతన, నళిని తదితరులను విడుదల చేయాలని జయ ప్రభుత్వం భావిస్తోందని, సిఆర్పీసీ సెక్షన్ 435 ప్రకారం కేంద్రం అభిప్రాయం చేప్పాలని ప్రభుత్వ కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు.

ఈ వ్యవహారం గురువారం పార్లమెంటులో గందరగోళానికి దారి తీసింది. నళిని తదితరుల అస్త్రంతో జయలలిత ప్రతిపక్షాలకు షాకిచ్చారు. రాజీవ్‌ను విడుదల చేయాలనే నిర్ణయాన్ని ఎండిఎంకె, వామపక్షాలు కూడా స్వాగతించాయి. ఓట్ల కోసమే నిర్ణయమని చెబుతున్నప్పటికీ.. స్వాగతించకుండా ఉండలేని పరిస్థితి.

జయ నిర్ణయం.. ప్రతిపక్ష డిఎంకె, డిఎండికె, కాంగ్రెస్, బిజెపిలకు షాక్ అని చెప్పవచ్చు. రాజీవ్ హంతకుల విడుదల పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ.. జయలలిత నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో డిఎంకె కూడా చిక్కుల్లో పడింది. తమిళ ఎన్నికల్లో డిఎంకె, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి.

ఇక కేంద్రం దాని పైన ఏవిధంగా స్పందించినా కూడా జయలలితకే ఎక్కువ లాభం ఉండనుంది. రాజీవ్ హంతకులను విడుదల చేయడం పట్ల తమకు అభ్యంతరం లేదని కేంద్రం చెబితే.. తమ వల్లే విడుదలయ్యారని జయ పార్టీ చెప్పుకుంటుంది. కేంద్రం వ్యతిరేకంగా వ్యవహరించినా.. జయకే లబ్ధి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు సాధించాలనుకుంటున్న బిజెపిని జయలలిత ఇప్పుడు ఇరుకున పెట్టారు.

English summary
Jayalalithaa's missive Rajiv assassins puts Centre in a bind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X