పన్నీరుసెల్వం బాంబు: శశికళను సొంత టీవీ ఛానల్ ఇరికించిందా?
దివంగత జయలలిత మృతి పైన రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బాంబు పేల్చారు. ఆయన చెప్పిన షాకింగ్ అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
చెన్నై: దివంగత జయలలిత మృతి పైన రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం బాంబు పేల్చారు. ఆయన చెప్పిన షాకింగ్ అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
జయలలిత విషయంలో పన్నీరు సెల్వం చెప్పింది నిజమేనా? అని తరిచి చూస్తే అవుననే చెప్పవచ్చునని అంటున్నారు. అందుకు ఓ ముఖ్యమైన కారణాన్ని కూడా చూపిస్తున్నారు. అదే 'జయ టీవీ..

పన్నీరు సంచలన వ్యాఖ్య
జయలలిత మృతిపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ పన్నీరు సెల్వం రెండు రోజుల క్రితం ఒక్క రోజు నిరసన దీక్ష చేశారు. ఈ దీక్ష సమయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మృతిపై ఇలా..
జయలలిత డిసెంబర్ 5న సాయంత్రం నాలుగున్నర గంటలకు చనిపోయిందని, తనకు ఆరున్నర గంటలకు విషయం తెలిసిందని పన్నీరు చెప్పారు. అధికారిక ప్రకటన మాత్రం రాత్రి పదకొండున్నర గంటలకు వచ్చింది.

నెట్టివేయడం నుంచి మృతి వరకు..
పన్నీరుతో పాటు పలువురు నేతలు కూడా శశికళ పైన సంచలన ఆరోపణలు చేశారు. పోయెస్ గార్డెన్‌లో జయలలితను ఎవరో నెట్టారని, అఫ్పుడు ఆమెకు గాయాలయ్యాయని ఆరోపించారు.

ఎన్నో అనుమానాలు
ఆసుపత్రిలో చేరిన నాలుగైదు రోజులకు జయ ఆరోగ్యం బాగుందని చెప్పారని, కానీ ఆ తర్వాత ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఎయిమ్స్ నివేదికలో మాత్రం ఆసుపత్రికి వచ్చినప్పుడు అపస్మారక స్థితిలో ఉందని చెబుతున్నారని, తేడా కనిపిస్తోందని విపక్షాలు అంటున్నాయి.

పన్నీరు వ్యాఖ్యలపై చర్చ
వీటన్నింటిని పక్కన పెడితే... ప్రధానంగా పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. నాలుగున్నరకు అమ్మ చనిపోయారని, ఆరున్నరకు తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు.

నిజం లేకపోలేదని..
పన్నీరు సెల్వం చెప్పిన వ్యాఖ్యలపై చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఇందులో నిజం లేకపోలేదనే వాదనలు కూడా ఉన్నాయి. అమ్మ మృతి పైన ఆ రోజు రాత్రి పదకొండున్నర గంటలకు అధికారిక ప్రకటన వచ్చింది.

ముందే జయ మృతిపై ప్రచారం
అయితే, అంతకుముందే జయలలిత మృతి చెందిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. దీంతో అపోలో ఆసుపత్రి వద్ద అమ్మ అభిమానులు హంగామా చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.

ఇలా పన్నీరు చెప్పింది కరెక్టేనా?
అమ్మ మృతి చెందిందని తొలుత వచ్చింది కూడా జయ టీవీలోనే అని అప్పుడు వార్తలు వచ్చాయి. జయ టీవీ.. జయలలిత-శశికళలదే. అందులో శశికళకు ఎక్కువ షేర్లు కూడా ఉన్నాయి. అంటే అమ్మ మృతి చెందినట్లు తెలియగానే జయ టీవీలో వచ్చిందని, కానీ ఉద్రిక్తత నేపథ్యంలో ఆ తర్వాత చనిపోలేదని ప్రకటన వచ్చిందని, తిరిగి రాత్రి పదకొండున్నర గంటలకు మృతి వార్త చెప్పినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. అంటే, పన్నీరు సెల్వం చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం ఉండొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications