విజయకాంత్‌ను దెబ్బ తీసిన తెలుగు ఓటర్లు: ఎందుకు?
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో తెలుగు వారు తమ సత్తా చాటుకున్నారు. తమ ఓటు హక్కుతో రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పారు. తాగిన మైకంలో వాగిన వారికి, ఓటుకు డబ్బులు ఎర వేసిన వారికి, లేనిపోని ఎన్నికల హామీ ఇచ్చిన వారికి తగిన గుణపాఠం చెప్పి వారి సత్తా చూపించారు.
మమ్మల్ని నిర్లక్షం చేస్తే పరిస్థితి ఇలా ఉంటుందని సైలెంట్ గా సమాధానం ఇచ్చారు. పలు జిల్లాల్లో తెలుగు ఓటర్లు అన్నా డీఎంకే, డీఎంకేకి ఓట్లు వేశారు. తమిళ నాయుడు వర్గానికి చెందిన క్యాప్టెన్ విజయ్ కాంత్ ను ఛీకొట్టి సమాధానం చెప్పారు.
తమిళనాడులో తెలుగు ఓటర్లు అధికంగా ఉన్నారు. ద్రవిడ పార్టీల నాయకులు తెలుగు వారి ఓట్లు సంపాధించాలని నానా తంటాలు పడ్డారు. అయితే చివరి వరకు మౌనంగా ఉన్న తెలుగు ఓటర్లు పోలింగ్ రోజు తమ ఓటు హక్కుతో కుళ్లు రాజకీయ నాయకులకు సరైన సమాధానం చెప్పారు.

తమిళనాడులో తెలుగు ఓటర్ల శాతం ఎక్కువే
తమిళనాడులో 27 శాతం తెలుగు ఓటర్లు ఉన్నారు. పలు జిల్లాల్లో ఏ పార్టీ విజయం సాధించాలన్నా తెలుగు వారి ఓట్లు కీలకం అయ్యాయి

చెన్నై నగరంలో 40 % ఓట్లు
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 18.40 లక్షల మంది ప్రవాసాంధ్రులు నివాసం ఉంటున్నారు. చెన్నై నగరంలో 40 శాతం ఓట్లు తెలుగు వారివే.

అమ్మకు అండగా ఉన్న తెలుగు వాళ్లు
చెన్నై నగరంలోని ఆర్ కే నగర్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత రెండవ సారి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ నియోజక వర్గంలో దాదాపు 45 శాతం ప్రవాసాంధ్రులు నివాసం ఉంటున్నారు.

చెన్నైలో 18.40 లక్షల మంది తెలుగువారు
చెన్నై నగరంలో 18.40 లక్షల మంది ప్రవాసాంధ్రులు నివాసం ఉంటున్నారు. అందరికి ఓటు హక్కు ఉంది. చెన్నై నగరంలో ఏ శాసన సభ నియోజక వర్గంలోఎవ్వరు గెలవాలన్నా తెలుగు వారిని ప్రసన్నం చేసుకోవాలి

జయకు ఆధిక్యం, కరుణకు సహకారం
2016 శాసన సభ ఎన్నికల్లో తెలుగు వారు ఎక్కువ శాతం కుమారి జయలలితకు మద్దతు ఇచ్చారు. కరుణానిధికి 19 నియోజక వర్గాల్లో తెలుగు వారు మద్దతు ఇచ్చారు

తెలుగు వారు ఎక్కువగా ఉన్న జిల్లాలు
కోయంబత్తూరు జిల్లాలో 12.11 లక్షల మంది (35 శాతం), అరియలూరులో 1.14 లక్షల మంది ( 15 శాతం), కడలూరులో 6. 53 లక్షల మంది (25 శాతం) ఓటర్లు ఉన్నారు.

తెలుగు వారు ఎక్కువగా ఉన్న జిల్లాలు
థర్మపురిలో4.53లక్షల మంది (30 శాతం), దిండిగల్ లో 5.49 లక్షల మంది (25 శాతం), ఈరోడ్డులో 4.50 లక్షల మంది (20 శాతం), కాంచీపురంలో 14 లక్షల మంది (35 శాతం), కన్యాకుమారిలో 1.88 లక్షల మంది (10 శాతం) ఓటర్లు ఉన్నారు.

తెలుగు వారు ఎక్కువగా ఉన్న జిల్లాలు
కరూర్ లో 2.12 లక్షల మంది (20 శాతం),క్రిష్ణగిరిలో 6.59 లక్షల మంది ( 35 శాతం), మధురైలో 10.64 లక్షల మంది (35 శాతం), నాగపట్నంలో 3.24 లక్షల మంది (20 శాతం), నామక్కల్ లో 3.46 లక్షల మంది (20 శాతం), నీలగిరీస్ లో 1.11 లక్షల మంది (15 శాతం) ఓటర్లు ఉన్నారు.

తెలుగు వారు ఎక్కువగా ఉన్న జిల్లాలు
సేలంలో 8.70 లక్షల మంది (25 శాతం), పుదుక్కోటై లో 10 లక్షల మంది ( 30 .24 శాతం), రామనాథపురంలో 2.03 లక్షల మంది (15 శాతం), శివగంగైలో 3.35 లక్షల మంది( 25 శాతం), తంజావూరులో 6.03 లక్షల మంది (25 శాతం), తిరువళ్లూరులో 14.92 లక్షల మంది (40 శాతం), తిరువణ్ణామలైలో 6.17 లక్షల మంది(25 శాతం) ఓటర్లు ఉన్నారు.

తమిళనాడు
వేలూరులో 11.62 లక్షల మంది ( 30 శాతం), విల్లుపురంలో 8.65 లక్షల మంది (25 శాతం), విరుద్ నగర్ లో 5.50 లక్షల మంది (30 శాతం), తిరుచ్చి (తిరుచునాపల్లి)లో 8.16 లక్షల మంది (30 శాతం) మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. తమిళనాడులో 195 శాసన సభ నియోజక వర్గాల్లో 27 శాతం తెలుగు వారి ఓట్లు ఉన్నాయి.












Click it and Unblock the Notifications