• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

6వసారి సీఎంగా జయ, స్టాలిన్ హాజరు: మంత్రిగా తెలుగు వ్యక్తి, కేబినెట్లో వీరే...

By Srinivas
|

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. 28 మంది మంత్రులతో కలిసి మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆమె చేత గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రమాణం చేయించారు. జయ దేవుని సాక్షిగా ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు, ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. జయలలిత ప్రమాణ స్వీకారోత్సవానికి భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి జయలలిత రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.

Jayalalithaa sworn in as Chief Minister of Tamil Nadu

జయలలిత ముఖ్యమంత్రిగా అయ్యారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలోని సెంటినరీ సమావేశ మందిరంలో ప్రమాణ స్వీకారం చేశారు. తాను నమ్మినబంటు పన్నీరు సెల్వంకు ఆర్థిక శాఖను ఇచ్చారు. తెలుగు వ్యక్తి రాజుకు ఓ శాఖను అప్పగించారు.

జయ ప్రమాణం సమయంలో అభిమానుల కేకలు

కార్యకర్తలు, నేతలు అమ్మగా పిలుచుకునే పురచ్చితలైవి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ప్రమాణానికి లేచిన సమయంలో, ప్రమాణ స్వీకారం ప్రారంభ సమయంలోనూ అభిమానులు వేసిన ఈలలు, కేకలతో కేరింతలు కొట్టారు.

మంత్రులు వీరే..

పన్నీరు సెల్వం - ఆర్థిక శాఖ

దిండిగల్ శ్రీనివాసన - అటవీ శాఖ

ఎదప్పడి కె పలని స్వామి - హైవే, పబ్లిక్ వర్స్

సెల్లూర్ కె రాజు - కార్మిక శాఖ

తంగమణి - విద్యుత్, ఎక్సైజ్ శాఖ

వేలుమణి - మున్సిఫల్, గ్రామీణాభివృద్ధి శాఖ

జయకుమార్ - మత్స్య సంవర్థక శాఖ

సీవీ షణ్ముగం - న్యాయ, జైళ్ల శాఖ

కేపీ అన్భజగాన్ - ఉన్నత విద్యాశాఖ

డా వి సరోజ- సాంఘీక సంక్షేమ శాఖ

కేసీ కరుప్పనన్ - పర్యావరణ శాఖ

ఎంసీ సంపత్ - పరిశ్రమలు

ఆర్ కామరాజ్ - ఆహార, పౌర సరఫరాలు

మణియన్ - చేనేత మరియు జౌళి

ఉదయమణి రాధాకృష్ణన్ - హౌసింగ్ అండ్ అర్బన్ అభివృద్ధి

కాదంబుర్ రాజు - సమాచార, ప్రసార శాఖ

దురైకన్ను - వ్యవసాయం, పశుసంవర్థకం

షణ్ముంగనాథన్ - పాలు మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి

విద్యాభాస్కర్ - ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం

ఉదయ్ కుమార్ - రెవెన్యూ

రాజేంద్ర బాలాజీ - గ్రామీణ పరిశ్రమలు

వీరమణి - కమర్షియల్స్ పన్నుల శాఖ

బెంజమిన్ - పాఠశాల విద్య , క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ

వెల్లమండి ఎన్ నటరాజన్ - పర్యాటక శాఖ

వాలర్మతి - వెనుకబడిన తరగతుల మరియు మైనారిటీ సంక్షేమ శాఖ

రాజలక్ష్మి - ఆది ద్రవిడర్ , గిరిజన సంక్షేమం

ఎం మణికందన్- ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ

ఎం ఆర్ విద్యా భాస్కర్ - రవాణా శాఖ.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amidst loud applause, Jayalalithaa takes the oath of Chief Minister office, in the name of God. This is her sixth term as Chief Minister of the State.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more