జయలలిత వేలిముద్రలు, ఎన్నికల్లో పోటీ, ఎన్నికల కమిషన్ కు నోటీసులు ఇచ్చిన హైకోర్టు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వేలిముద్రల కేసులో మద్రాసు హైకోర్టు ఎన్నికల కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. జయలలిత వేలిముద్రల కేసు విచారణకు కచ్చితంగా హాజరుకావాలని మద్రాసు హైకోర్టు ఎన్నికల కమిషన్ కు సూచించింది.

అనారోగ్యంతో జయలలిత గత సంవత్సరం నవంబర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడులో రెండు శాసన సభ నియోజక వర్గాల్లో, పుదుచ్చేరీలో ఒక శాసన సభ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులకు బీఫాం ఇచ్చి అందులో అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా జయలలిత సంతకం చేయాల్సి ఉంది.

jayalalithaa thumb impression case.

అన్నారోగ్యంతో ఉన్న జయలలిత సంతకం చెయ్యలేకపోవడంతో అన్నాడీఎంకే పార్టీ నేతలు ప్రభుత్వ వైద్యుల సమక్షంలో బీఫాంలో ఆమె వేలిముద్రలు వేయించి ఎన్నికల అధికారులకు సమర్పించారు. జయలలిత సంతకం కాకుండా వేలిముద్రలు వెయ్యడంతో అప్పట్లో పెద్ద వివాదం అయ్యింది.

అయితే ఎన్నికల కమిషన్ అధికారులు బీఫాంలు తీసుకుని ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ముగ్గురు అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. జయలలిత వేలిముద్రల విషయంపై కొందరు మద్రాసు హై కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు విచారణ జరుగుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Madras high court has issued a notice to TN Chief Election Commissioner to appear before court in Jayalalithaa thump impression case.
Please Wait while comments are loading...