జయలలిత కొడనాడ్ ఎస్టేట్ గార్డ్ దారుణ హత్య: జయ ఆస్తుల టార్గెట్ వెనుక?

తమిళనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్ అయిన కొడనాడు ఎస్టేట్ వాచ్‌మన్ దారుణ హత్యకు గురయ్యాడు. అతని పేరు ఓంకార్. నేపాల్ వాసి. అతని హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారు?

చెన్నై: తమిళనాడులోని దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎస్టేట్ అయిన కొడనాడు ఎస్టేట్ వాచ్‌మన్ దారుణ హత్యకు గురయ్యాడు. అతని పేరు ఓంకార్. నేపాల్ వాసి. అతని హత్య పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారు? ఎందుకు చేశారో తెలియాల్సి ఉంది.

ఇటీవల తమిళనాడులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. అయిదు రోజుల క్రితం చెన్నై శివారులోని జయలలిత గెస్ట్ హౌస్ దగ్ధమైంది. అందులో కీలక పత్రాలు ధ్వంసమయ్యాయి.

jayalalithaa

ఇప్పుడు ఊటీ సమీపంలోని కొడనాట్ ఎస్టేట్ వాచ్‌మన్ హత్యకు గురయ్యాడు. కీలక పత్రాలు దొంగిలించారని తెలుస్తోంది. జయలలిత ఆస్తులే లక్ష్యంగా ఇటీవల టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. కొడనాడ్ ఎస్టేట్ ఆస్తుల విలువ రూ. వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా.

ఇది కోటగిరికి సమీపంలో కోడనాడ్‌ టీ ఎస్టేట్‌. ఇక్కడ ఓంకార్ బహదూర్‌(51) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు.

అదే సమయంలో కృష్ణా బహదూర్‌ అనే మరో వాచ్‌మెన్‌ వారిని అదుపు చేయడానికి యత్నించగా అతనిపై దాడి చేసి పరారయ్యారు. క్షతగాత్రుడు కృష్ణా బహదూర్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వాచ్ మెన్ హత్య, ఆస్తి పత్రాల దోపిడీ విధానాన్ని పరిశీలిస్తున్నారు. వారం క్రితం ఆస్తి పత్రాలు తగలబడటంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+