
ఆసుపత్రిలో జయలలిత ఇడ్లీలు తినలేదు, పచ్చి అపద్దం, శశికళ, డాక్టర్ వాంగ్మూలం !
Recommended Video

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిటీ విచారణ ముమ్మరం చేసింది. అమ్మ మృతిపై తమిళనాడు ప్రభుత్వ డాక్టర్లు బాలాజీ, ధర్మారాజ్ లను విచారణ కమిటీ తమ కార్యాలయానికి పిలిపించి ప్రశ్నల వర్షం కురుపించింది. డిసెంబర్ 2వ తేదీన జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని, తాను స్వయంగా చూశానని డాక్టర్ బాలాజీ విచారణ కమిటి కమిషన్ చీఫ్ ఆర్ముగస్వామి ముందు వాంగ్మూలం ఇచ్చారు.

శశికళ మాత్రమే !
జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గదిలోకి శశికళ ప్రతిరోజూ వెళ్లేవారని, తాను స్వయంగా చూశానని తమిళనాడు ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ బాలాజీ ఆర్ముగస్వామి విచారణ కమిటీ ముందు వివరణ ఇచ్చారు.

శుద్ద అపద్దం
జయలలిత ఆహారం తీసుకున్నారని అందరూ చెబుతున్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదని డాక్టర్ బాలాజీ స్పష్టం చేశారు. అపోలో ఆస్పత్రిలో జయలలిత చేరిన రెండువారాల దాకా ఆమె ఇడ్లీలు తినలేదని, కేవలం ద్రవపదార్థాలు (జ్యూస్ లు) మాత్రమే తీసుకున్నారని డాక్టర్ బాలాజీ ఆర్ముగస్వామి విచారణ కమిటీ ముందు క్లారిటీ ఇచ్చారు.

వేలి ముద్రల వివాదం
తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం సహా మూడు శాసన సభ నియోజక వర్గాల్లో ( ఒకటి పుద్దుచ్చేరి) గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థుల బీ ఫాంల్లో జయలలిత వేలిముద్రలు తీసుకున్నారు. తిరుప్పరంకుండ్రంలో వేసిన నామినేషన్ లో ఉన్న వేలిముద్రలు జయలలితవి కావని ఆరోపణలు ఉన్నాయి.

డాక్టర్ శరవణన్ ఫిర్యాదు
అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థుల బీ ఫాంల్లో జయలలిత వేసిన వేలిముద్రలు ఆమె బతికి ఉన్నప్పుడు వేసినట్లుగా లేవని తిరుప్పరంకుండ్రం శాసన సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ గుర్తుతో పోటీ చేసిన డాక్టర్ శరవణన్ జయలలిత మృతి పై ఏర్పాటు చేసిన ఆర్ముగస్వామి విచారణ కమిటీకి ఫిర్యాదు చేశారు.

సమన్లు జారీ
డీఎంకే పార్టీ నాయకుడు డాక్టర్ శరవణన్ ఫిర్యాదు నేపథ్యంలో జయలలిత చికిత్సలను పర్యవేక్షించడానికి తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య బృందంలో సభ్యులైన డాక్టర్ బాలాజీ, మధుమేహ వైద్య నిపుణుడు డాక్టర్ ధర్మరాజ్ ఆర్ముగస్వామి విచారణ కమిటీ ముందు హాజరైనారు.

సాక్షిగా వెళ్లాను
రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి అడిగిన పలు ప్రశ్నలకు డాక్టర్ బాలాజీ, డాక్టర్ ధర్మరాజ్ సమాధానాలిచ్చారు. అపోలో ఆస్పత్రిలో అన్నాడీఎంకే అభ్యర్థుల బీ ఫాంల్లో జయలలిత వేలిముద్రలను నమోదు చేయించడానికి తాను సాక్షిగా వెళ్లానని డాక్టర్ బాలాజీ చెప్పారు.

గదిలో శశికళ !
అన్నాడీఎంకే అభ్యర్థుల బీ ఫాంలో జయలలిత వేలిముద్రలు తీసుకునే సమయంలో ఆమె స్పృహలోనే ఉన్నారని, ఆ సమయంలో అమ్మ గదిలో శశికళ నటరాజన్ మాత్రమే ఉన్నారని డాక్టర్ బాలాజీ ఆర్ముగస్వామి కమిటీ ముందు వివరణ ఇచ్చారు.

జయలలిత నో అన్నారు
లండన్ వెళ్లి చికిత్స పొందటానికి జయలలిత అంగీకరించలేదని అపోలో ఆస్పత్రి వర్గాల ద్వారా తనకు తెలిసిందని డాక్టర్ బాలాజీ ఆర్ముగస్వామి విచారణ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చారు. తర్వాత జయలలితకు అందించిన చికిత్సల వివరాలను కూడా బాలాజీ ఆర్ముగస్వామి కమిటీ ముందు చెప్పారు.

మళ్లీ రావాలి
జయలలిత చికిత్స విషంలో విచారణకు ఈనెల 27వ తేదీ తన ముందు మరోసారి హాజరు కావాలని డాక్టర్ బాలాజీ, డాక్టర్ ధర్మరాజ్ లను రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ఆదేశించారు. మొత్తానికి ఆసుపత్రిలో జయలలిత ఇండ్లీలు, ఉప్మా తిన్నారు అంటూ అందరూ కట్టుకథలు చెప్పారని స్పష్టంగా వెలుగు చూసింది.