అమ్మ ఆరోగ్యం ఎఫెక్ట్: తమిళ చానెళ్ల పంట పండింది..!
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూస్తుంటే.. తమిళ టీవీ చానెళ్ల మార్కెట్లు మాత్రం ఊపందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చెన్నై : ఓపక్క తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. మరోపక్క ఆ వార్తలను ప్రసారం చేస్తున్న టీవీ చానెళ్ల షేర్లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతుండడం గమనార్హం. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నడుమ దేశీయ మార్కెట్లు నష్టాలను చవిచూస్తుంటే.. తమిళ టీవీ చానెళ్ల మార్కెట్లు మాత్రం ఊపందుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

జయలలిత ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తల నేపథ్యంలో.. సన్ టీవి నెట్ వర్క్ షేర్ 6.5శాతం, రాజ్ టీవీ నెట్ వర్క్ 8.8శాతం మేర దూసుకెళ్లాయి. ఇక జీ ఎంటర్టైన్ మెంట్స్ 2.17శాతం, డిష్ టీవి 1.64శాతం మేర నష్టపోయాయి. కాగా, లాభాల్లో దూసుకెళుతున్న సన్ టీవీ నెట్ వర్క్ డీఎంకే అధినేత కరుణానిధి మారన్ ముని మేనల్లుడుది అన్నది సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications