షిఫ్ట్: కేజ్రీవాల్‌పై జయప్రద ప్రశంస, అఖిలేష్‌పై ఫైర్
లక్నో: సినీ నటి, రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తరప్రదేశ్‌లోని సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఉత్తరప్రదేశ్ ప్రజలు చలిపులి, పొగమంచుతో ఇబ్బందులు పడుతుంటే అఖిలేష్ యాదవ్ మాత్రం సైఫై మహోత్సవం చేసుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. ప్రజల కష్టాలు అఖిలేష్ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆమె విమర్శించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేస్తున్నారని ఆమె అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారా అని విలేకరులు ప్రశ్నిస్తే... తన రాజకీయ జీవితం అమర్ సింగ్ చేతుల్లో ఉందని సమాధానమిచ్చారు. అమర్ సింగ్ ఏం చేయమంటే అది చేస్తానని అన్నారు.
రాజమండ్రి పార్లమెంటు సీటు నుంచి కాంగ్రెసు తరఫున పోటీ చేయడానికి జయప్రద ఆ మధ్య కాలంలో సోనియా గాంధీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే ఉద్దేశంతో ఆమె రాజమండ్రి సీటుపై పట్టుబడుతున్నారు.












Click it and Unblock the Notifications