కర్ణాటక కోటీశ్వరుడు, మూర్ఖశిఖామణి, డీసీఎంను ఏకేసిన ప్రతిపక్షం, పడమర సూర్యుడి పరిస్థితి !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చులకగా మాట్లాడారని జేడీఎస్ పార్టీ మండిపడుతోంది. దీనిపై ట్విట్ చేసిన జేడీఎస్ పార్టీ కర్ణాటకను తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు తాకట్టు పెట్టిన పెద్ద మనిషి, ఈస్టిండియా కంపెనీల పొలిటికల్ ఏజెంట్, కర్ణాటక కోటీశ్వరుడు, బ్రోకర్ కింగ్ డీకే శివకుమార్ అంటూ జేడీఎస్ పార్టీ తీవ్రస్థాయిలో విమర్శించింది.
జీవితం మొత్తం దళారిగా వ్యవహరిస్తున్న డీకే శివకుమార్ ప్రజల సొమ్మును జీవితమంతా దోచుకున్న వ్యక్తి అని, ఇప్పుడు ఈయన ఇతరులను తేలిగ్గా, చులకనగా మాట్లాడుతున్నారని జేడీఎస్ నాయకులు మండిపడుతున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పెద్ద మూర్ఖశిఖామణి అని, నిజానికి అలా ఆయన గురించి చెప్పడం కూడా మాకు ఇష్టం లేదని జేడీఎస్ నాయకులు అంటున్నారు.

నిత్యం ప్రజల సొమ్మును దోపిడి దినచర్యగా మార్చుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ రోజువారీ ఆదాయ మార్గంగా టార్గెట్ చేసుకుంటున్నారని జేడీఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఇలాంటి డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉండటం కన్నడిగుల దౌర్బాగ్యం అని జేడీఎస్ పార్టీ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు అంతులేని కోరికలు ఉన్నాయని జేడీఎస్ ఆరోపించారు.
కర్ణాటకలో లూటీలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆడబ్బు ఖర్చు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని జేడీఎస్ పార్టీ మరోసారి ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అక్రమాలకు అంతం లేదా? అని ప్రజలు అడుగుతున్నారని, కాంగ్రెస్ పార్టీకి ముగింపు దగ్గరలోనే ఉందని, ఇలాంటి నాయకులకు పుల్ స్టాప్ పెట్టాలని జేడీఎస్ పార్టీ కన్నడిగులకు మనవి చేసింది. పడమటి దిక్కులో సూర్యుడు అస్తమించినట్లే త్వరలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హస్త మిస్తుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని జేడీఎస్ పార్టీ వ్యంగంగా ట్వీట్ చేసింది.












Click it and Unblock the Notifications