ఫిబ్రవరిలో యడియూరప్ప రాజీనామా ?: సీఎంగా మరో లీడర్, శోభాకు సీఎం కొడుకులు చెక్ !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం బీఎస్. యడియూరప్ప మీద ఆపరేషన్ కమల ఆరోపణలు చేస్తూ ఆడియో విడుదల చేసి సంచలనం సృష్టించిన జేడీఎస్ నాయకుడు శరణ గౌడ నాయక్ కుందకూర మరోసారి ఆయన మీద బాంబు వేశారు. 2020 ఫిబ్రవరి వరకు యడియూరప్ప సీఎంగా ఉంటారని, తరువాత బీజేపీలోని మరో ప్రముఖ నాయకుడు సీఎం కుర్చిలో ఉంటారని జేడీఎస్ నాయకుడు శరణ గౌడ నాయక్ యాదగిరిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

సొంత పార్టీలో సీఎంకు చెక్ !
గురుమిట్కల్ లో జేడీఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ధర్నాను ఉద్దేశించి మాట్లాడిన శరణ గౌడ యడియూరప్ప ఆపరేషన్ కమల ఆడియో కేసు మళ్లీ రీఓపెన్ చెయ్యాలని బీజేపీకి చెందిన నాయకులే తమ మీద ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. సీఎం యడియూరప్పకు అదే బీజేపీలోని ఓ ప్రముఖ నాయకుడు చెక్ పెడుతున్నారని, ఆ నాయకుడు ఇప్పటికే తనతో చాలాసార్లు ఫోన్ లో మాట్లాడారని శరణ గౌడ ఆరోపించారు.
Recommended Video

సీఎంకు వార్నింగ్ !
బీజేపీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు సీఎం యడియూరప్పకు వెనుక నుంచి గోతి తవ్వుతున్నారని, ఆయన భవిష్యత్తు నాచేతిలో ఉందని శరణ గౌడ ఆరోపించారు. రెండు రోజుల్లో గురుమిట్కల్ నియోజక వర్గం అభివృద్దికి నిధులు మంజూరు చెయ్యకుంటే ఆపరేషన్ కమల కేసు రీ ఓపెన్ చేయిస్తానని సీఎం యడియూరప్పకు జేడీఎస్ నాయకుడు శరణ గౌడ సవాల్ చేశారు.

ఫిబ్రవరిలో సీఎం రాజీనామా ?
ఫిబ్రవరిలో సీఎం యడియూరప్ప బడ్జెట్ ప్రవేశ పెట్టిన తరువాత ఆయన పదవికి రాజీనామా ? చేస్తారని జేడీఎస్ నాయకుడు శరణ గౌడ జోస్యం చెప్పారు. యడియూరప్ప బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తారని, బీజేపీలోని ఓ సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని జేడీఎస్ నాయకుడు శరణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శోభాకు చెక్ పెట్టిన సీఎం కొడుకులు
యడియూరప్ప సీఎం కుర్చిలో 5 లేదా 6 నెలల మాత్రమే ఉంటారని జేడీఎస్ నాయకుడు శరణ గౌడ అన్నారు. బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లేతో సీఎం యడియూరప్ప ఎక్కువ చనువుగా ఉంటారని, ఇద్దరు పక్కపక్కన కుర్చుని మాట్లాడుకుంటారని శరణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ శోభా కరందాజ్లేతో కలిసి వెళ్లడానికి సీఎం యడియూరప్పకు ఆయన కుమారులు విజయేంద్ర, బీజేపీ ఎంపీ రాఘవేంద్ర వదిలి పెట్టడం లేదని జేడీఎస్ నాయకుడు శరణ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆపరేషన్ కమల ఆడియో విడుదల
శరణ గౌడ నాయక్ తో బీఎస్. యడియూరప్ప, హాసన్ ఎమ్మెల్యే ప్రీతం గౌడ, మరో బీజేపీ నాయకుడు ఫోన్ లో ఆపరేషన్ కమల గురించి మాట్లాడిన వివరాల ఆడియోను స్వయంగా శరణ గౌడ నాయక్ గత సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మీడియాకు విడుదల చేశారు. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైయ్యింది. ఆ సమయంలో ఆపరేషన్ కమల విషయం పెద్ద వివాదంగా మారింది.












Click it and Unblock the Notifications