'గాలి కుమార్తె పెళ్లికి అంత భారీ ఖర్చా!.. ప్రభుత్వం ఏంచేస్తోంది?'
హైదరాబాద్ : మైనింగ్ సామ్రాట్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహంపై ప్రభుత్వాన్ని నిలదీశారు జేడీయూ నేత శరద్ యాదవ్. దేశంలో కరెన్సీ కష్టాలు ప్రతీ సామాన్యుడిని వెంటాడుతున్న నేపథ్యంలో.. చాలా పెళ్లిళ్లు ఆగిపోతున్నాయని, అలాంటిది గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి మాత్రం ధూంధాంగా జరిగిందని అన్నారు.

పెళ్లి కోసం అత్యంత భారీ స్థాయిలో రూ.500కోట్లు ఖర్చు పెడుతుంటే.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు శరద్ యాదవ్. కాగా, బెంగుళూరు ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన గాలి కుమార్తె పెళ్లి గురించి దేశమంతా చర్చించుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల రద్దుతో గాలి కుమార్తె పెళ్లికి ఆటంకాలు ఎదురవవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమయినప్పటికీ.. అనుకున్నట్టుగానే పెళ్లిని గ్రాండ్ గా జరిపించారు గాలి జనార్దన్.












Click it and Unblock the Notifications