నరేంద్ర మోడీకి మా సత్తా చూపిస్తాం: నితీష్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో తమ దెబ్బ ఏమిటో చూపిస్తామని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏని ఇంటికి పంపిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. బుధవారం బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆర్ జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ పాట్నాలో మీడియాతో మాట్లాడారు.
జేడీయూ, ఆర్ జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏని ఓడిస్తుందని జోస్యం చెప్పారు. తమ కూటమిలో ఎలాంటి వివాదాలు లేవని, అందరం కలిసే ఉన్నామని, ఇప్పటికే సీట్ల పంపకం తేలిపోయిందని నితీష్ కుమార్ చెప్పారు.

బీహార్ లో బీజేపీ గల్లంతు అవుతుందని బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్ జేడీ నేత లాలు ప్రసాద్ యాదవ్ చెప్పారు. ఈ నెల గాంధీ మైదానంలో తమ కూటమి ఆధ్వర్యంలో స్వాభిమాన్ ర్యాలి నిర్వహిస్తామని అన్నారు. ఈ ర్యాలిలో తమ మీద ఆరోపణలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి సరైన సమాధానం చెబుతామని వివరించారు.
బీహార్ లో 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో జేడీయూ 100 సీట్లలో, ఆర్ జేడీ 100 సీట్లలో పోటి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లతో సరిపుచ్చుకునింది. మిగిలిన మూడు సీట్లలో ఎన్సీపీ పోటి చెయ్యాలని బుధవారం నాయకులు నిర్ణయించారు.












Click it and Unblock the Notifications