అసూయతో 18 రోజుల చిన్నారిని ఆస్పత్రిపై నుంచి విసిరేసిన మేనత్త
కాన్పూర్: తనకు కొడుకులు లేరన్న అసూయతో 18 రోజుల పసికందును అత్తే మూడంతస్తుల మీది నుంచి కిందకు విసిరేసింది. ఈ ఘటనలో ఆ చిన్నారి స్వల్ప గాయలతో బయటపడ్డాడు. అంతేకాదు ఆసుపత్రి భవనం నుంచి మేనల్లుడిని కిందకు విసిరేసిన అత్త సరితాదేవిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన యూపీలోని కాన్పూర్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఘటన మొత్తం సీసీటీవి కెమెరాలో రికార్డైంది. వివరాల్లోకి వెళితే... సరితాదేవి అనే మహిళకు ముగ్గురు కూతుళ్లు. కొడుకులు మాత్రం లేరు. అన్మోల్ అనే 18 రోజుల పసికందుకు సెప్టిసేమియా రావడంతో అతడిని కళ్యాణ్‌పూర్‌లోని శ్యామ్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
అయితే అత్యవసర పని ఉండటంతో పసికందు తల్లిదండ్రులు సర్వేష్ కుమార్, అల్కా తమ స్వగ్రామానికి వెళ్లి, పిల్లాడి బాధ్యతను మేనత్త సరితాదేవికి అప్పగించారు. అయితే హఠాత్తుగా తెల్లవారుజామున 5 గంటల సమయంలో చిన్నారి కనిపించడం లేదంటూ సరితాదేవి నర్సులకు చెప్పింది.

దీంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చిన్నారి కోసం గాలిస్తుండగా ఆసుపత్రిలోనే మరో బ్లాకు నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. జాగ్రత్తగా చూస్తే చిన్నారి ఓ ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుని ఉన్నాడు. అదే సమయంలో చిన్నారి ఏడుపు విన్న ఆసుపత్రి ఆసుపత్రి వార్డెన్ చిన్నారిని రక్షించాడు.
చిన్నారి బాగా గాయపడ్డాడని, ఊపిరి కూడా సరిగా అందలేదని వైద్యులు చెప్పారు. అయితే అతడు కింద పడకపోవడం మాత్రం అదృష్టమని చెప్పారు. విచారణలో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజి చూస్తే సరితాదేవి స్వయంగా బాబుని ఎత్తుకొని వెళ్లడం సీసీటీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది.
బాబును కిందికి విసిరేసిన తర్వాత చేతిలో బాబును ఎత్తుకున్నట్లే టవల్ పెట్టుకొని లోపలికి రావడం కనిపించింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో ఆమెను ప్రశ్నించగా.. నేరాన్ని అంగీకరించింది. పిల్లాడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications