వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2020: మే 7న పరీక్ష ఫలితాలు ఎప్పుడో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ - అడ్వాన్స్‌డ్ 2020 (జేఈఈ అడ్వాన్స్‌డ్)‌కు సంబంధించి ఢిల్లీ ఐఐటీ వివరాలను విడుదల చేసింది. ఈ పరీక్షను ఐఐటీ ఢిల్లీ నిర్వహించనుంది. ఇక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష మే 17,2020న నిర్వహించనుండగా... ఫలితాలను జూన్ 8న విడుదల చేయనుంది. ఇక సీట్ల అలాట్‌మెంట్ జూన్ 17, 2020న ఉండే అవకాశం ఉందని ఢిల్లీ ఐఐటీ తెలిపింది. మే 17, 2020న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2020 పరీక్షను దేశవ్యాప్తంగా 155 నగరాల్లో నిర్వహిస్తారు. ఇక పరీక్షకు సంబంధించి జవాబులు కలిగిన ఫైనల్ కీని జూన్ నెల రెండో వారంలో విడుదల చేస్తారు. జూన్ 17 నుంచి అభ్యర్థులకు సీట్ల కేటాయింపులు ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేసింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్-2020కి సంబంధించి పూర్తి వివరాలు మరియు ముఖ్య తేదీలు :

* జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 రిజిస్ట్రేషన్: జేఈఈ అడ్వాన్స్‌డ్-2020కి సంబంధించిన అప్లికేషన్‌ ఫామ్‌ను మే మొదటి వారంలో విడుదల చేస్తారు. ఇక మే రెండోవారంలోగా అభ్యర్థులు అప్లికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

JEE Advanced 2020 :Exam on May 7th and Results on June 8th 2020

* జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 అడ్మిట్ కార్డు: జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 అడ్మిట్ కార్డును ఐఐటీ ఢిల్లీ మే నెల మూడో వారంలో రిలీజ్ చేస్తుంది

* జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 పరీక్ష తేదీ: జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 పరీక్ష మే 17న దేశవ్యాప్తంగా ఉన్న 155 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది.

*జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 సమాధానాల కీ: జూన్ రెండో వారంలో జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 ఫైనల్ కీని ఢిల్లీ ఐఐటీ విడుదల చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి అభ్యర్థులు అక్కడ అడిగే సమాచారంను పూర్తి చేస్తే తమకు వచ్చిన మార్కులు చూసుకోవచ్చు.

*జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 ఫలితాలు: జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 ఫలితాలు జూన్ 8, 2020న ఢిల్లీ ఐఐటీ విడుదల చేస్తుంది. అభ్యర్థి పరీక్షలో సాధించిన మార్కులు, ఆలిండియా ర్యాంకు, సబ్జెక్టు వారీగా మార్కులను పొందుపరుస్తారు.

* జేఈఈ అడ్వాన్స్‌డ్-2020 కౌన్సిలింగ్: సీట్ల కేటాయింపులో భాగంగా జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 17న ఉండే అవకాశం ఉంది.

ఫలితాలకు సంబంధించి ఢిల్లీ ఐఐటీ పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి మొబైల్ ఫోన్‌కు ఎస్ఎంఎస్ పంపుతుంది. అయితే అభ్యర్థి ర్యాంక్ కార్డుకు సంబంధించి ఎలాంటి హార్డ్ కాపీలను సంస్థ పంపదు. అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

English summary
JEE Advanced result 2020 will be announced by the IIT Delhi on June 8, 2020 on the official website. Aspirants will be required to enter their details like registration number, date of birth, mobile number and email ID to check JEE Advanced results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X