వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

JEE Main 2021 Results:మార్చి 7వ తేదీన ఫిబ్రవరి సెషన్ ఫలితాలు..పూర్తి వివరాలు..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఫిబ్రవరిలో జరిగిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (JEE)మెయిన్ 2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)మార్చి 7వ తేదీన అంటే ఈ ఆదివారం రోజున విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు విడుదల చేసిన తర్వాత వివరాలను అధికారిక జేఈఈ వెబ్‌సైట్‌పై పొందుపర్చనున్నారు అధికారు. ఫలితాల కోసం అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి అభ్యర్థులు తమ వివరాలను పూర్తి చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఇదిలా ఉంటే విద్యార్థులు గతేడాది జరిగిన జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్ కటాఫ్ మార్కులు తెలుసుకుంటే ఈ సారి అంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామినేషన్ 2021లో క్వాలిఫై అయ్యేందుకు కటాఫ్ మార్కులు ఎంత ఉండే అవకాశం ఉందో ఒక ఐడియా వస్తుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2021 ఎగ్జామ్ ఈ ఏడాది జూలై 3న నిర్వహిస్తారు.

JEE Main 2021 :February session results likely to be released on March 7th

గతేడాది జేఈఈ మెయిన్ ఎగ్జామ్ కటాఫ్ పర్సంటైల్ వివరాలు ఇలా ఉన్నాయి.

* కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL)/జనరల్ కేటగిరీ: 90.3765335

* ఆర్థికంగా వెనకబడిన వర్గాలు (EWS) - 70.2435518

* ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ (OBC-NCL)-72.8887969

* షెడ్యూల్ కులాలు (SC): 50.1760245

* షెడ్యూల్ తెగలు (ST): 39.0696101

* దివ్యాంగులు (PwD): 0.0618524

Recommended Video

JEE Advanced 2021 Exam To Be Held On July 3 - Ramesh Pokhriyal | Oneindia Telugu

ఇప్పటికే జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్‌కు సంబంధించి సమాధానాల కీ‌ మరియు ప్రశ్నాపత్రాలను అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in పొందుపర్చడం జరిగింది. అభ్యర్థులు ఈ సైట్‌పై లాగిన్ అయి కూడా తమ స్కోరుపై ఒక అంచనాకు రావొచ్చు. ప్రస్తుతం మార్చిలో జరిగే జేఈఈ మెయిన్ 2021 పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కరోనా కారణంగా జేఈఈ మెయిన్ పరీక్ష ఈ ఏడాది నాలుగు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్‌ 2021 పరీక్ష రాసేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఉండాలన్న మంచి ఉద్దేశంతోనే నాలుగు సెషన్లుగా పరీక్ష నిర్వహించడం జరుగుతోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఇదివరకే స్పష్టం చేశారు.

English summary
The result of the JEE Main 2021 February session will most likely be released on the official website on March 7, as per NTA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X