జేఈఈ మెయిన్స్ 2021కు దరఖాస్తులు ప్రారంభం: ఈసారి 4 పర్యాయాలు పరీక్షలు, వివరాలివే
న్యూఢిల్లీ: జేసీసీ(జాయింట్ ఎంట్రాన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ 2021 రిజిస్ట్రేషన్లు మంగళవారం(డిసెంబర్ 15) నుంచి ప్రారంభమయ్యాయి. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు 2021లో జరిగే జేఈఈ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
డిసెంబర్ 15న ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ 2021 దరఖాస్తుల ప్రక్రియ తుది గడువు జనవరి 15, 2021తో ముగియనుంది. పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు, దరఖాస్తుల తేదీల పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.

2021లో నాలుగుసార్లు జేఈఈ మెయిన్స్
2021లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. గత గురువారం బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో ఆన్‌లైన్ సంభాషణ సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.
సాధారణంగా జేఈఈ మెయిన్స్ 2 పర్యాయాలు మాత్రమే నిర్వహిస్తారు. కానీ, వచ్చే ఏడాది నుంచి ఫిబ్రవరి నుంచి మే వరకు ప్రతి ఒక్కసారి జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అభ్యర్థులకు సౌలభ్యాన్ని అందించడానికి ఒకటి లేదా అన్ని పరీక్షలకు హాజరయ్యే ఆప్షన్ ఎంచుకోవచ్చునని కేంద్రమంత్రి తెలిపారు. మొత్తం పరీక్షలలో అత్యధిక స్కోర్, ర్యాంకును ప్రవేశాలకు అర్హతగా పరిగణించనున్నట్లు వెల్లడించారు.
జేఈఈ మెయిన్స్ షెడ్యూల్
4 విడతల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహించాలని ఎన్‌టీఏ నిర్ణయం
ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి పరీక్ష
మార్చి ఏప్రిల్, మే నెలల్లో మరో 3 విడతల్లో పరీక్ష నిర్వహణ.












Click it and Unblock the Notifications