జెట్ ఎయిర్‌వేస్ నుంచి మరో ఆఫర్: రూ.1,111కే టికెట్, 3రోజులే గడువు
జెట్ ఎయిర్‌వేస్ మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రస్తుతం పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు రెయిన్ డీల్స్ పేరుతో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ.1,111గా నిర్ణయించింది.
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్‌వేస్ మరో సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రస్తుతం పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు రెయిన్ డీల్స్ పేరుతో ఎంపిక చేసిన విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధరను రూ.1,111గా నిర్ణయించింది.
నేటి(జూన్7) నుంచి మూడు రోజులపాటు ప్రయాణికులకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుంది. ఈ ఆఫర్‌లో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జూన్ 27 నుంచి సెప్టెంబర్ 20మధ్య కాలంలో తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.

జెట్ ఎయిర్ వేస్ నిర్వహించే విమానాలపైన మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. కోడ్ షేర్, ఇంటర్ లైన్‌పై ఇది వర్తించదు. భారతీయ మార్కెట్లో పౌర విమానయానం రంగంలో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో విమాన సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎయిర్ఏషియా, ఇండిగోలు కూడా ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications