వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెట్ విమానం వెంటొచ్చిన జర్మనీ యుద్ధ విమానాలు: పైలట్ నిద్రే కారణం!(వీడియో)

ఇటీవల ఎయిర్ ట్రాఫిక్ కంట్రో‌ల్ సంబంధాలు తెగిపోవడంతో ఆందోళన చెందిన జర్మనీ ఏవియేషన్ అధికారులు రెండు యుద్ధ విమానాలను.. జెట్ ఎయిర్‌లైన్స్ విమానం వెంట పంపిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఇటీవల ఎయిర్ ట్రాఫిక్ కంట్రో‌ల్ సంబంధాలు తెగిపోవడంతో ఆందోళన చెందిన జర్మనీ ఏవియేషన్ అధికారులు రెండు యుద్ధ విమానాలను.. జెట్ ఎయిర్‌లైన్స్ విమానం వెంట పంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ పరిణామం మొత్తానికి జెట్ విమానంలోని ఓ పైలట్ నిద్రపోవడమే కారణంగా తెలిసింది.

కాగా, ఆ విమానంలో 15మంది విమాన సిబ్బంది, 330మంది ప్రయాణికులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ముంబై నుంచి లండన్‌ బయల్దేరిన జెట్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోవడంపై అధికారులు విచారణ చేపట్టి నివేదిక తయారు చేశారు.

<strong>330మందితో వెళ్తున్న జెట్ విమానానికి తప్పిన ముప్పు: వెంటొచ్చిన జర్మనీ యుద్ధ విమానాలు</strong>330మందితో వెళ్తున్న జెట్ విమానానికి తప్పిన ముప్పు: వెంటొచ్చిన జర్మనీ యుద్ధ విమానాలు

విమానాన్ని నడపాల్సిన ఒక పైలట్‌ నిద్రపోతుండగా, మరో పైలట్‌ పెట్టుకున్న హెడ్‌సెట్‌ వాల్యూమ్‌ తగ్గించి ఉండటం వల్ల ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తున్న సూచనలు వినిపించకపోవడంతో తప్పుడు ఫ్రీక్వెన్సీలో విమానాన్ని నడిపారు. దీంతో విమానం సరైన మార్గంలో కాకుండా దారితప్పడంతో పాటు ఎయిర్‌ కంట్రోల్‌ సిబ్బందితో సంబంధాలు తెగిపోయాయి.

తప్పుడు ఫ్రీక్వెన్సీ, ఏటీసీ అధికారులు చేసే సూచనలు వినిపించేందుకు పైలట్‌ పెట్టుకునే హెడ్‌సెట్‌ వాల్యూమ్‌ తక్కువగా ఉండటం వల్ల రెండో పైలట్‌ను చేరుకోలేకపోయామని జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికారులు వెల్లడించారు.

జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యూ 118 విమానం జర్మనీ గగనతలంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఆ విమానానికి మార్గనిర్దేశం చేసేందుకు 9డబ్ల్యూ 122 విమానాన్ని అధికారులు పంపించారు. దాదాపు 15 నిమిషాల అనంతరం సంబంధాలు పునరుద్ధరించారు.

English summary
A Jet Airways Mumbai to London flight carrying 330 passengers and 15 crew members recently raised a hijack-alarm while it was over German airspace. It happened on February 16 after the plane lost communication with the ground staff for 33 minutes. Two German fighter planes were sent in to inspect the aircraft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X