ఎన్నికల వేళ.. రాహుల్ నయా స్ట్రాటజీ

Jharkhand Assembly elecrtions 2024: దేశంలో మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్‌లల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఫలితంగా ఈ రెండు చోట్లా రాజకీయ వేడి రాజుకుంది. ఎన్నికల్లో గెలుపోటములపై వ్యూహ, ప్రతివ్యూహాలను రచించుకుంటోన్నాయి అన్ని పార్టీలు.

మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి జార్ఖండ్‌లో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 44. ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా అధికారంలో ఉంది. జార్ఖండ్ ముక్తి మోర్చా-కాంగ్రెస్- వామపక్షాల ప్రభుత్వానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నాయకత్వాన్ని వహిస్తోన్నారు.

Jharkhand Assembly elections 2024 Rahul Gandhi will visit Ranchi on October 19

నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి జేఎంఎం-కాంగ్రెస్- వామపక్షాలు, ఈ సారి అధికారంలోకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరాలని ఎన్డీఏ ప్రయత్నాలు సాగిస్తోన్నాయి.

ఈ క్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జార్ఖండ్‌లో పర్యటించనున్నారు. శనివారం రాంచీలో బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ పేరుతో కాంగ్రెస్ ఈ సభను నిర్వహించనుంది. రాహుల్ గాంధీ సహా జార్ఖండ్‌కు చెందిన పలువురు నాయకులు ఇందులో పాల్గొననున్నారు.

రాజ్యాంగ పరిరక్షణ కోసం ఆగస్టులో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహించతలపెట్టింది. సంవిధాన్ సమ్మాన్ సమ్మేళన్ పేరుతో దేశవ్యాప్తంగా సభలను నిర్వహిస్తూ వస్తోంది. తొలుత ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ఈ సభను నిర్వహించింది. అనంతరం ప్రయాగ్ రాజ్, కొల్హాపూర్‌లల్లో ఈ సభలు జరిగాయి.

ఇప్పుడు తాజాగా రాంచీలో ఈ సభ ఏర్పాటైంది. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తరచూ రాజ్యాంగ ఉల్లంఘనలు చోటు చేసుకుంటోన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తోంది కాంగ్రెస్. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందంటూ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+