Jharkhand Assembly Elections: జార్ఖండ్ లో ఇండియా కూటమి సీట్ల ఖరారు-జేఎంఎంకు 43..

ఈ నెలలో ఎన్నికలకు సిద్ధమవుతున్న జార్ఖండ్ లో మరోసారి అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న ఇండియా కూటమి ఇవాళ సీట్ల పంపకాల్ని పూర్తి చేసింది. గత సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి పార్టీలు సీట్ల పంపకాల్లో పట్టుదలకు పోవడంతో ఇన్నాళ్లూ ఇది ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో సీట్ల పంపకాలను పూర్తి చేశారు.

ఇండియా కూటమిలో కుదిరిన సీట్ల ఒప్పందం ప్రకారం.. సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీకి అత్యధికంగా 43 సీట్లు కేటాయించారు. కాంగ్రెస్ 30 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనుంది. అలాగే రాష్ట్రీయ జనతాదళ్ ఆరు స్థానాల్లో పోటీ చేయనుంది. వామపక్షాలు నిర్సా, సింద్రీ, బగోదర్‌ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నాయి. దీంతో పాటు
ధన్వర్, ఛత్రపూర్, విశ్రాంపూర్ అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని నిర్ణయించారు.

Jharkhand Assembly Elections jmm to get 43 seats as india bloc finalises seat-sharing deal

జార్ఖండ్‌లోని 82 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ఈ ఎన్నికల్లో అధికార ఇండియా కూటమికీ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ముఖ్యంగా సీఎం హేమంత్ సోరెన్ ను జైలుకు పంపిన ఎన్డీయేపై ఎలాగైనా పైచేయి సాధించాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. మరోవైపు బీజేపీ కూడా ఈసారి ఛత్తీస్ ఘడ్ తరహాలో గిరిజన రాష్ట్ర జార్ఖండ్ లో గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+