వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జియాఖాన్‌ది ఆత్మహత్య: సిబిఐ, టైం అడిగిన తల్లి

|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటి జియాఖాన్ మృతి కేసు మిస్టరీ వీడింది. జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు సిబిఐ ధ్రువీకరించింది. ఈ కేసులో మళ్లీ విచారణ అవసరం లేదని కూడా అభిప్రాయపడింది. ఈ విషయాన్ని సీబీఐ బాంబే హైకోర్టుకు తెలిపింది.

తాము సేకరించిన మౌఖిక, డాక్యుమెంటరీ, సైంటిఫిక్‌, ఫోరెన్సిక్‌ సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. జియా తల్లి ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని, అవసరమైతే సీబీఐ ఎఫ్‌బీఐ సహకారం కూడా తీసుకోవాలని పిటీషన్‌ వేసింది.

Jiah's death was suicide; no need to reinvestigate: CBI

జియా సూసైడ్‌ లేఖ రాయడానికి ముందు అరగంటకు పైగా తన ఫ్లాట్‌లోనే ఉందని, ఓ లేఖ రాయడానికి ఈ సమయం సరిపోతుందని సీబీఐ పేర్కొంది. జియా.. సూరజ్‌కి 400 సెకన్ల పాటు మెసేజ్‌లు చేసిందని ఆ తర్వాత కూడా లేఖ రాయడానికి తగిన సమయం ఉందని సీబీఐ వివరించింది.

కాగా, సీబీఐ చెప్పిన విషయాలపై తనకు సమయం కావాలని జియా ఖాన్ తల్లి తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. అనంతరం ఈ కేసు జూలై 6వ తేదీకి వాయిదా పడింది. 2013, జూన్‌ 3న జియాఖాన్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జియా ప్రియుడు సూరజ్‌ పంచోలీ నిందితుడిగా కొన్ని రోజులు జైల్లో గడిపిన విషయం తెలిసిందే.

English summary
The Central Bureau of Investigation (CBI) has informed the Bombay High Court that starlet Jiah Khan's death was caused by "suicidal hanging", and that it had come to such a conclusion based on "oral, documentary, scientific and cyber forensic evidences".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X