ప్రేమకు నిరాకరించిందని కత్తితో దాడి, ఆత్మహత్య
థానే: తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో తన ప్రియురాలిపై కత్తి దాడికి పాల్పాడ్డాడు ఓ యువకుడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ఉల్హస్నాగర్‌లోని సుబాష్ టెక్డిలో మంగళవారం రాత్రి 9గంటలకు చోటు చేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. అమ్రపాలినగర్‌కు చెందిన బాధితురాలు పూజ భలెరావు(21)ను అదే గ్రామానికి చెందిన నిందితుడు అకాష్(23) గత కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. తనను వివాహం చేసుకుంటానని ఆమె వెంట పడుతున్నాడు. అయితే పూజ అతని ప్రేమను నిరాకరించింది.

కాగా, పూజకు వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న అకాష్... నేరుగా ఆమె ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఆ తర్వాత అదే కత్తితో అతనూ పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పూజ వివాహాన్ని జూన్ 1న నిశ్చయించిన కారణంగా పూజ కుటుంబ సభ్యులు షాపింగ్ కోసం బయటికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి పూజ, అకాష్‌లు రక్తపు మడుగులో విగత జీవులుగా పడివున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసున్నారు.












Click it and Unblock the Notifications