వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఒక్క ప్రకటనతో.. అమాంతం ఎగబాకిన రిలయన్స్ షేర్స్

ఏప్రిల్ 01, 2017నుంచి టారిఫ్ వసూలు చేయనున్నట్లు రిలయన్స్ అధినేత అంబానీ మంగళవారం ప్రకటించారు. మల్టీ బిలియన్ టెలికాం వెంచర్ నుంచి నగదు ప్రవాహం కోసం వేచిచూస్తున్న ఇన్వెస్టర్స్ .

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జియోతో టెలికాం రంగాలను కుదేలు చేసిన రిలయన్స్.. ఇప్పుడు టారిఫ్ ప్లాన్స్ ప్రకటించి షేర్ మార్కెట్లోను దూసుకెళ్తోంది. నిన్నటిదాకా ఉచిత సర్వీసులతో ఇతర టెలికాం కస్టమర్స్ ను సైతం తనవైపుకు తిప్పుకున్న రిలయన్స్.. తాజా డేటా ప్లాన్ ప్రకటనతో ఇన్వెస్టర్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ బుధవారం నాడు 8ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడం విశేషం. దీన్నిబట్టి ఇన్వెస్టర్లకు ఈ ప్లాన్ ఎంత బూస్టింగ్ ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ తాజా డేటా ప్లాన్ ప్రకటనతో 7శాతం జంప్ చేసిన సంస్థ షేర్స్ బీఎస్ఈలో రూ.1166గా ట్రేడ్ అవుతున్నాయి.

Jio’s winding up of freebies lifts RIL shares to 8-year high: Next 30 days crucial, say brokers

మరోవైపు ఎయిర్ టెల్, ఐడియా వంటి మిగతా టెలికాం దిగ్గజాలు నెగటివ్ ట్రేడింగ్ లో కొనసాగుతున్నాయి. కాగా, గతేడాది సెప్టెంబర్ నుంచి ఫ్రీ డేటా మరియు ఫ్రీ కాలింగ్ సర్వీసులను అందిస్తూ వచ్చిన రిలయన్స్ ఇకనుంచి వాటిని ఉపసంహరించుకోనుంది.

ఏప్రిల్ 01, 2017నుంచి టారిఫ్ వసూలు చేయనున్నట్లు రిలయన్స్ అధినేత అంబానీ మంగళవారం ప్రకటించారు. మల్టీ బిలియన్ టెలికాం వెంచర్ నుంచి నగదు ప్రవాహం కోసం వేచిచూస్తున్న ఇన్వెస్టర్స్ కు ఈ ప్రకటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లయింది.

ఇదంతా బాగానే ఉన్నా.. టారిఫ్ వసూలుతో కస్టమర్స్ జారిపోయే అవకాశం లేదంటున్నారు నిపుణులు. మరి రిలయన్స్ తన కస్టమర్స్ ను ఎలా నిలుపుకుంటుందో వేచిచూడాలని చెబుతున్నారు. మొత్తం మీద ఇన్నాళ్లు కస్టమర్స్ కు, ఇప్పుడు ఇన్వెస్టర్స్ కు మేలు చేకూర్చేలా రిలయన్స్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతుంది.

English summary
Shares of Reliance IndustriesBSE 9.64 % (RIL) shot up 10 per cent in Wednesday’s trade to hit a level last touched in June 2009. The stock logged the gains after the company said it would start charging for its 4G services from April 1, 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X