వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్ పండిట్‌లకు ప్రత్యేక టౌన్‌షిప్‌లు: శ్రీనగర్‌లో ఆందోళనలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: కాశ్మీర్‌లో మరోసారి ఆందోళనలు ఊపందుకున్నాయి. కాశ్మీర్ పండిట్లకు ప్రత్యేక టౌన్‌షిప్ ఏర్పాటు చేయనున్నారనే అంశంపై యాసిన్ మాలిక్ నేతృత్వంలోని జేకేఎల్ఎఫ్ ధర్నాకు పిలుపునిచ్చింది. దీంతో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ వద్ద పలువురు ఆందోళన చేపట్టారు.

ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు, ఆందోళనకారులు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జీ, భాష్పవాయువును ప్రయోగించారు.

JKLF supporters protest in Srinagar over rehabilitation of Kashmiri pandits

జేకేఎల్ఎఫ్ నిర్వహంచిన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో జేకేఎల్ఎఫ్ లీడర్ యాసిన్ మాలిక్‌ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. జమ్మా కాశ్మీర్ ముఖ్యమంత్రి ముప్తీ మహ్మాద్ ఈ వారం మొదట్లో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన తర్వాతనే మొదలయ్యాయి.

కాశ్మీరీ పండిట్ల కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న టౌన్‌షిప్‌ల కోసం భూమి ఇచ్చేందుకు సీఎం ముప్తీ తొలుత అంగీకరించినా, ఆ తర్వాత కాశ్మీర్ పండిట్లు విడిగా ఉండేందుకు వీలు కాదని, కలిసి జీవించాల్సిందేనంటూ హోం మంత్రితో చెప్పినట్లు తెలిపారు.

ఈ నిర్ణయంతో జేకేఎల్ఎఫ్ లీడర్ యాసిన్ మాలిక్‌ శుక్రవారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో శ్రీనగర్ లాల్ చౌక్ మొత్తం అల్లర్లతో ఉడికిపోతుంది. శనివారం పూర్తి బంద్‌గా ప్రకటించారు.

English summary
Violent protests erupted in Srinagar on Friday afternoon after JKLF workers took to the streets protesting the rehabilitation plan of Kashmiri Pandits.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X