వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు.. హై సెక్యూరిటీ జోన్, గట్టి భద్రత

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్‌లో అధికార కూటమి ఎమ్మెల్యేలను రాయ్ పూర్ రిసార్ట్‌కు తరలించారు. బీజేపీ ప్రలోభాల పర్వానికి తెరతీస్తుందనే అనుమానాల నేపథ్యంలో తరలింపు ప్రక్రియ చేపట్టింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలను హేమంత్ సోరెన్ వర్గం తరలించింది. మేఫెయిర్ గోల్డ్ రిసార్ట్ వద్ద.. హై సెక్యూరిటీ జోన్ వద్ద ఎమ్మెల్యేలు బస చేస్తారు. పాలక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఓకేచోటకు చేర్చామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.

 JMM, Congress, RJD MLAs check in at Chhattisgarh hotel amid poaching threat

గనుల కేటాయింపు అంశం హేమంత్ సోరెన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే శాసన సభ్యత్వం రద్దు చేస్తున్నామని గవర్నర్ రమేశ్ బయస్ ఉత్తర్వులు జారీచేశారు. దీనిని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫై చేసింది. దీంతో రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. ఎమ్మెల్యేలకు ప్రలోభాలకు గురిచేస్తారని.. తరలింపు ప్రక్రియను చేపట్టారు.

హేమంత్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై కేంద్ర ప్ర‌భుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయ‌డం, ఆ ఫిర్యాదును కేంద్రం... ఎన్నిక‌ల సంఘానికి పంపడం, హేమంత్ శాస‌న స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దుకు ఈసీ సిఫార‌సు చేయ‌డం, ఈసీ సిఫార‌సు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని ర‌ద్దు చేస్తూ గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం తీసుకోవ‌డం చకచకా జ‌రిగిపోయాయి. కీల‌క ప‌రిణామం త‌ర్వాత త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేల తరలింపు ప్రక్రియను చేపట్టారు.

English summary
threat of poaching Jharkhand legislators, the ruling JMM with Congress and RJD MLAs reached Raipur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X